బాసర : దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మహారాష్ట్ర సర్కారు.. రెండు రాష్ట్రాల నీటిపారుదల, సీడబ్ల్యూసీ, బాబ్లీ బంధారా కృతి సమితి సభ్యుల సమక్షంలో బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను ఎత్తింది. ప్రస్తుతం ఆ ప్రాజెక్టులో 1,064 అడుగుల వద్ద 15,567 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.
బాబ్లీ గేట్లు తెరచుకోవడంతో దిగువన ఉన్న రైతులు, మత్స్యకారులు హర్షం వ్యక్తంచేశారు. గోదావరి నదికి నీటి ప్రవాహం సాయంత్రం వరకు పెరగనున్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంత ప్రజలు, రైతులు, జాలర్లు, అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ పవన్ చంద్ర, ఎస్సై శ్రీనివాస్ ఉమ్మడి ప్రకటనలో తెలిపారు.