రాష్ట్ర అటవీ,న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
నిర్మల్ అర్బన్, ఆగస్టు 13: నిర్మల్ జిల్లా ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలుగొందుతున్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పట్టణంలోని భాగ్యనగర్ రాధాకృష్ణ ఆలయాన్ని శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోలకు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యే పూజలు చేశారు. రాధాకృష్ణ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి తెలిపారు. జిల్లాను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు రూ. 60 కోట్లతో 600 ఆలయాలను నిర్మించామని చెప్పారు. మంత్రిని ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు పాకాల రాంచందర్, పట్టణ అధ్యక్షుడు మారనుగొండ రాము, మాజీ కౌన్సిలర్ నర్సయ్య, భూషణ్ రెడ్డి, ముడారపు గంగాధర్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
మంత్రి అల్లోలకు ఆహ్వానం
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నిర్మించిన వేంకటేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపనకు రావాలని కోరు తూ ఆలయ కమిటీ బాధ్యులు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి శుక్రవారం ఆహ్వాన పత్రం అందజేశారు. ఈనెల 20న విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాగభూషణ్, రామమౌళి, కాళేశ్వర ఆలయ డైరెక్టర్ కొరిపెల్లి దేవేందర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి ఉన్నారు.
డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకున్న మంత్రి
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తన డ్రైవింగ్ లైసెన్స్‌ను రెన్యువల్ చేసుకున్నారు. శుక్రవారం రవాణా శాఖ కార్యాలయానికి రాగా, డీటీవో అజయ్ కుమార్ రెడ్డి స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఉద్యోగులు శ్రీదేవి, సతీశ్ ఉన్నారు.
కొరిటికల్ శ్రీలక్ష్మీవేంకటేశ్వరాలయంలో ప్రతిష్ఠాపనోత్సవాలు
మామడ,ఆగస్టు13 : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించుకోవాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మండలంలోని కొరిటికల్‌లో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలకు మంత్రి శుక్రవారం హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. గ్రామంలో నిర్మించనున్న సాయిబాబా ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. అనంతరం అన్నదానం ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, సర్పంచ్ పాట్కూరి భోజవ్వ, ఎంపీటీసీ అందె సౌజన్య, డీసీసీబీ మాజీ చైర్మన్ రాం కిషన్‌రెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షుడు గంగాధర్, జిల్లా నాయకులు భూషణ్‌రెడ్డి, ఎంపీపీలు మహిపాల్‌రెడ్డి, రామేశ్వర్‌రెడ్డి, ఆలయ,గ్రామాభివృద్ధి కమిటీల సభ్యులు పాల్గొన్నారు.
కనుల పండువగా ఉత్సవాలు
విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలను కన్నుల పండువగా నిర్వహించారు. మండలంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.