ప్రైవేట్ దవాఖాన ప్రారంభోత్సవానికి హాజరు
ఘనస్వాగతం పలికిన మంత్రి అల్లోల, టీఆర్ఎస్ నేత వేణుగోపాలాచారి, కలెక్టర్ ముషారఫ్
నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 5: మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ ఆదివారం నిర్మల్ పట్టణం లో పర్యటించారు. స్థానికంగా శ్రీకర్ మల్టీ స్పెషాలిటీ ద వాఖాన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. హైదరాబా ద్ నుంచి హెలిక్యాప్టర్ ద్యారా నిర్మల్‌కు చేరుకున్న ఆయనకు స్థానిక ఎ న్టీఆర్ మినీ స్టేడియంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకర ణ్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత వేణుగోపాలా చారి, నిర్మల్ కలెక్టర్ ము షారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమం త్ బోర్కడే, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ పు ష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికా రు. స్థానిక నటరాజ్ నగర్లో శ్రీకర్ మల్టీ స్పెషాలిటీ దవాఖానను మంత్రి అల్లోల ఇం ద్రకరణ్ రెడ్డితో కలిసి మాజీ ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు శాలువా, మెమోంటోతో ఘనంగా స న్మానించారు. మాజీ ప్రధాని పర్యటనతో పో లీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కా ర్యక్రమంలో దవాఖాన అధినేత గట్టుబాబు, ఐఎంఏ అ ధ్యక్షుడు అప్పాల చక్రధరి, ఎంసీ లింగన్న తదితరులున్నారు.
పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దుతాం..
నిర్మల్ జిల్లాను పర్యాటక రంగంగా మరింత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర అటవీ, పర్యా వరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పట్టణంలోని శ్యాంగఢ్ కోట వద్ద ఏర్పాటు చేసిన హరిత హోటల్‌ను ఆయ న ఆదివారం ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మా ట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లా చుట్టూ అనేక ప ర్యాటక ప్రదేశాలు ఉన్నందున, నిర్మల్ జిల్లా టూరిస్ట్‌లకు ఎంతో అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. గండి రా మన్న హరిత వనంలో పర్యాటకుల కోసం ఎకో హట్లను నిర్మిస్తున్నామన్నారు. మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎఫ్ఎస్సీ ఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, ఎంపీపీ కొరిపెల్లి రామేశ్వర్ రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లోల మురళీధర్ రెడ్డి, ఆ యా వార్డుల కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు.
హరిత హోటల్ప్రారంభం
సోన్, సెప్టెంబర్ 5: సోన్ మండలంలోని కడ్తాల్ వై జంక్షన్ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన హరిత హోటల్‌ను రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు. నిర్మల్ పట్టణం జిల్లా కేంద్రం అయిన తర్వాత ఇక్కడ ప్రజల సం దడి, రాకపోకలు పెరిగాయని పేర్కొన్నారు. అంతే కాకుండా జిల్లాలో ఉన్న చారిత్రత్మక కట్టడాల నేపథ్యంలో హరిత హోటల్‌ను ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. నిర్మల్ జిల్లాలో పర్యాటక రంగాన్ని మరింత అభివృ ద్ధి చేసేందుకు ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు. జడ్పీటీసీ జీవన్‌రెడ్డి, పీఏసీఎస్ ఛైర్మన్ అంపోలి కృష్ణప్రసాద్‌రెడ్డి, నిర్మల్ ఎంపీపీ కొరిపెల్లి రామేశ్వర్‌రెడ్డి, కడ్తాల్ సర్పంచ్ బర్మ లక్ష్మీనర్సయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ బర్మదాసు, ఆయా గ్రా మాల సర్పంచ్‌లు వినోద్, ఎల్చల్ గంగారెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, వ్యాపారవేత్త అల్లోల మురళీధర్‌రెడ్డి, టీఆర్ఎస్ మం డల మా జీ కన్వీనర్ ముత్యంరెడ్డి, ఉన్నారు.
..