ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి
పుస్పూర్లో రైతు వేదిక ప్రారంభం
లోకేశ్వరం, జూలై, 5 : అన్నదాత అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని, రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని ముథోల్ ఎమ్మె ల్యే విఠల్ రెడ్డి అన్నారు. లోకేశ్వరం మండలం పుస్పూర్లో నిర్మించిన రైతు వేదికను సోమవారం ప్రారంభించారు. రైతుల సమస్యలపై చర్చించుకొని పరిష్కరించుకునేందుకు రైతు వేదికలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు.
ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ
మండలంలోని సాత్గాంలో రూ.1.18 కోట్లతో 22 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సోమవారం భూమి పూజ చేశారు. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డబుల్బెడ్రూం ఇళ్లు నిర్మిస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ అధ్యక్షుడు లోలం శ్యాంసుందర్, ఎంపీపీ లలితా భోజన్న, సర్పంచ్లు సంగెం నర్సయ్య, గౌరోల్ల లక్ష్మి, స్పెషల్ ఆఫీసర్ కిరణ్ కుమార్, తహసీల్దార్ లోకేశ్వర్ రావు, ట్రైయినీ ఎస్సై కృష్ణ సాగర్ రెడ్డి, ఎంపీడీవో గంగాధర్, ఏవో గణేశ్, పీఏసీఎస్ చైర్మన్ రత్నాకర్ రావు, టీఆర్ఎస్ మండల కన్వీనర్ లక్ష్మణ్ రావు, రైతుబంధు సమితి అధ్యక్షుడు లింగన్న, ట్రాన్స్ కో ఏఈ శివప్రసాద్, ఏపీవో నవీన్, ఏపీఎం మల్లేశ్, నాయకులు చిన్నారావు, రాజేశ్ బాబు, మెండే శ్రీధర్, కరిపే శ్యామ్ సుందర్, కపిల్, గన్ను నర్సారెడ్డి, సుధాకర్, కోఆప్షన్ సభ్యులు కల్యాణ్, ప్రకాశ్, ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎరువుల గోదాం ప్రారంభం
మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన ఎరువుల గోదాంను ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రారంభించారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
భైంసా, జూలై 5 : సీఎంఆర్ఎఫ్ ద్వారా కిసాన్ గల్లీకి చెందిన గంగామణికి రూ. 60 వేలు, కే. నర్సింహులుకు రూ. 24 వేలు మంజూరు కాగా ఎమ్మెల్యే విఠల్ రెడ్డి వారికి చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సాయినాథ్, మంత్రి భోజరాం ఉన్నారు.