మంత్రి అల్లోల కుటుంబంపై బురదజల్లితే ఊరుకోం
అప్పాల గణేశ్ బాధితులకు అండగా ఉంటాం
నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, టీఆర్ఎస్ నాయకులు
నిర్మల్ అర్బన్, జులై 1: ఆధరాల్లేకుం డా మంత్రి అల్లోల కుటుంబంపై ఆరోపణలు చేస్తే, సహించబోమని నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము అన్నారు. బీజేపీ నాయకుడు అప్పాల గణేశ్ సవాల్‌ను స్వీకరించి, తామంతా గురువారం శి వాజీ చౌక్‌కు వచ్చామని, కాని ఆధా రాల్లేకపోవడంతో వారు రాలేదని ఎద్దేవా చేశారు. అప్పాల గణేశ్ చేసిన కబ్జాలు, అక్రమ దం దాలను నిరూపించేందుకే టీఆర్ఎస్ నాయకు లమంతా బైక్ ర్యాలీతో ఆధారాలతో ఇక్కడికి చేరుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్‌తో పాటు టీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు రాము మాట్లాడుతూ బీజేపీ నాయకులు గాలిమాటలతో ఉని కిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారని మండి పడ్డారు. మూడు పర్యాయాలు మున్సిపల్ చైర్మ న్ పదవులను అనుభవించిన అప్పాల కుటుంబ సభ్యులు పట్టణంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారని, వారు చేసిన భూ కబ్జాలు, సెటిల్మెంట్లపై తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని చూపించారు.
నిర్మల్ పట్టణం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని, ఇది ఓ ర్వలేకే మంత్రి కుటుంబంపై బురద జల్లే పని చే స్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి పనులతో నేడు నిర్మల్ జిల్లా కేంద్రం ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. పదేండ్ల కాలంలో అప్పాల గణేశ్, ఆయన కుటుంబసభ్యుల ద్వా రా మోసపోయిన బాధితులు తమను సంప్రది స్తే, వారికి న్యాయం చేస్తామని పేర్కొన్నారు. ఇ ప్పటికైనా అప్పాల గణేశ్ ముక్కు నేలకు రాసి, తన ఆస్తులను మున్సిపాల్టీకి అప్పగించి రాజకీ య సన్యా సం తీసుకోవాలని ఎద్దేవా చేశారు. మంత్రిపై అసత్య ప్రచారం చేస్తే, చూస్తూ ఊరు కోమని హెచ్చరించారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు, స్థానిక కౌన్సిలర్లు పాల్గొన్నారు.