తాజా పెరుగు కోసం
పెరుగు తోడు పెట్టడానికి ముందు.. పాలను కనీసం 10-15 నిమిషాల పాటు తక్కువ మంట మీద బాగా మరిగించాలి. పాలు చిక్కగా ఉంటే.. పెరుగు త్వరగా పులియదు. ఇక పాలు మరీ వేడిగా ఉన్నప్పుడు తోడు వేయకూడదు. ఇలాచేస్తే.. పెరుగు నీరులా అయిపోయి, త్వరగా పులుపు వచ్చేస్తుంది.
వేసవికాలంలో వంటింట్లో తప్పకుండా ఉండాల్సిన పదార్థం.. పెరుగు. అయితే, ఎండ ప్రభావంతో పెరుగు త్వరగా పులిసిపోతుంది. అలాకాకుండా ఉండాలంటే.. చిన్న చిట్కాలు పాటించాల్సిందే!
పెరుగు తోడు పెట్టడానికి ముందు.. పాలను కనీసం 10-15 నిమిషాల పాటు తక్కువ మంట మీద బాగా మరిగించాలి. పాలు చిక్కగా ఉంటే.. పెరుగు త్వరగా పులియదు. ఇక పాలు మరీ వేడిగా ఉన్నప్పుడు తోడు వేయకూడదు. ఇలాచేస్తే.. పెరుగు నీరులా అయిపోయి, త్వరగా పులుపు వచ్చేస్తుంది. అందుకే, గోరువెచ్చగా ఉన్నప్పుడే తోడు వేయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా, వేసవిలో తోడు వేసే పెరుగును చాలా తక్కువ పరిమాణంలో వాడాలి. ఎక్కువ వేస్తే బ్యాక్టీరియా వేగంగా వృద్ధిచెందుతుంది. త్వరగానే పులిసిపోతుంది. తోడు వేసిన తర్వాత అందులో ఓ రెండు పచ్చి మిరపకాయలను తొడిమతో సహా వేయాలి. మిరపకాయలోని క్యాప్సైసిన్.. పెరుగు త్వరగా పులియకుండా ఆపుతుంది. పెరుగు గడ్డ కట్టిన తర్వాత మిరపకాయను తీసేస్తే సరి. ఇక పెరుగు గడ్డ కట్టిన వెంటనే ఫ్రిజ్‌లో పెట్టేయాలి.
బయట ఎంత ఎక్కువసేపు ఉంచితే.. అంత వేగంగా పులుపు పెరుగుతుంది. సాధ్యమైనంత వరకూ.. పెరుగును మట్టి పాత్రలోనే తోడు పెట్టాలి. మట్టి పాత్ర అదనపు తేమను పీల్చుకుని, పెరుగును చల్లగా ఉంచుతుంది. దాంతో, ఎక్కువ సేపు తాజాగా ఉంటుంది. ఇక పెరుగును స్టీల్, ప్లాస్టిక్ డబ్బాలలో నిల్వ చేయొద్దు. శుభ్రమైన గాజు పాత్రలో ఉంచితే.. రుచి, నాణ్యత దెబ్బతినవు. గాలి చొరబడకుండా గట్టిగా మూత పెట్టాలి.
లేకుంటే, అందులో తేమ చేరి బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. దాంతో, పెరుగు త్వరగా చెడిపోతుంది. పెరుగు పాత్రలో ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క వేస్తే.. పెరుగు త్వరగా పులియకుండా ఉంటుంది. చాలా రోజుల పాటు తాజాగా ఉంటుంది. పెరుగు పుల్లగా మారినట్లయితే.. రెండు చెంచాల పాలను వేడిచేసి, చల్లార్చిన తర్వాత అందులో కలపాలి. దీనివల్ల పులుపు తగ్గి, పెరుగు తియ్యగా మారుతుంది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ‘రణబాలి’కి టికెట్ ధరలే ప్లస్ పాయింట్.. ‘జైలర్ 2’తో పోటీలో విజయ్ దేవరకొండకు కలిసొచ్చే అంశమిదే!
Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

