వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ మహేందర్ రెడ్డి
ఆపరేషన్ ముస్కాన్‌పై సమీక్ష
ఎదులాపురం, జూలై 1: ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా బాలకార్మికులకు విముక్తి కల్పించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి అధికారులకు సూచించారు. హైదరాబాద్‌లోని కార్యాలయం నుంచి మహిళా సెక్యూరిటీ ఇన్చార్జి స్వాతీలక్రా, డీఐజీ బీ సుమతి, ఇతర అధికారులతో కలిసి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆదిలాబాద్ పోలీ స్ ముఖ్య కార్యాలయంలో ఈ వీసీకి అదనపు ఎస్పీ హాజరయ్యారు. ఈ మేరకు జిల్లా అదనపు ఎస్పీ ఎస్. శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ.. ఇన్ చార్జి ఎస్పీ ఎం రాజేశ్ చంద్ర ఆదేశాల మేరకు జి ల్లాలోని రెండు పోలీస్ సబ్ డివిజన్లలో ఎస్ఐల ఆ ధ్వర్యంలో రెవెన్యూ, కార్మిక, మహిళ, శిశు సంక్షే మ శాఖ, చైల్డ్ వెల్ఫేర్, ఐసీపీఎస్ అధికారులతో 14 మంది బృందంగా ఏర్పడి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి బాలబాలికలకు విముక్తి కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. బాలలను పనిలో పె ట్టుకొని వెట్టిచాకిరీ చేయించుకుంటున్న యజమానులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పేర్కొ న్నారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సీఐ ఈ. చంద్రమౌళి, ఎస్ఐ ఎం.ఏ హకీం, ఏఎస్ఐ ఎస్కే తాజొద్దీన్, డీసీపీవో రాజేంద్రప్రసాద్, సీడబ్ల్యూసీ కమిటీ సభ్యుడు సమీర్ ఉల్లాఖాన్, ప్రొటెక్షన్ అధికారి ఆర్.వినోద్ కుమార్, పోలీస్ సిబ్బంది ఆదిల క్ష్మి, ఠాకూర్ జగన్ సింగ్, రమేశ్ విజయ్ కుమార్, జీ అడెల్లు తదితరులు పాల్గొన్నారు.