నిర్మల్ అర్బన్, డిసెంబర్ 5 : శాంతి భద్రతల కు విఘాతం కలిగిస్తే ఎంతటివారైనా చర్యలు త ప్పవని నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల విభాగం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హాజరై, జిల్లాలలో వివిధ ప్రాం తాల ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వారిని ఆప్యాయంగా పలుకరించి, ఓపిగ్గా వారి సమస్య లు తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, పరిష్కరించాలని ఆదేశించారు.
ఎస్పీ మాట్లాడుతూ.. ఫ్రెండ్లీ పోలీసింగ్ అవలంబించేది మంచి మార్గంలో ఉన్న ప్ర జలకేనన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కాలనీ ల్లో సంచరిస్తే పోలీసులకు సాయం అందించాల ని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని దాడులు చేయవద్దన్నారు. పోలీస్ సాయం కావాలనుకునే వారు నిర్భయంగా పోలీస్స్టేషన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. జిల్లా ప్రజలకు మెరుగైన సేవ లు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.