కుంటాల, ఫిబ్రవరి, 16 : కుంటాల మండల ప్రజల ఇలవేల్పు శ్రీ గజ్జలమ్మ మహాదేవి జాతర బుధవారంతో ముగిసింది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భక్తులు పోటెత్తడంతో పండుగ వాతావరణ నెలకొన్నది. వేద పండితులు శ్రీ గురుమాంచి చంద్రశేఖర శర్మ ఆధ్వర్యంలో నిత్యవీధి, మహాపూర్ణ హారతి, కుంభాభిషేకం, గజ్జలమ్మ దేవికి పూల అలంకర ణ తదితర పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహిళలు బోనాలతో భజా భ జంత్రీల నడుమ ఊరేగింపుగా ఆలయానికి వెళ్లా రు. మొక్కులు తీర్చుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు, ప్రముఖులు అ మ్మవారిని దర్శించుకున్నారు. భైంసా రూరల్ సీ ఐ చంద్రశేఖర్, ఎస్ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో బం దోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు.