దిలావర్పూర్ సెప్టెంబర్ 29: రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ అక్టోబర్ 4న నిర్మల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారని నిర్మల్ కలెక్టర్ వరుణ్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని గుండంపల్లి సమీపంలో శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ ద్వారా నిర్మించిన కాళేశ్వర ప్యాకేజీ 27 ను ఆయన పరిశీలించారు. మంత్రి కేటీ హైదరాబద్ నుంచి గుండంపల్లి పంపుహౌస్ వరకు హెలిప్యాడ్ ద్వారా రానున్నారని తెలిపారు. ఈ సందర్భంగా వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో పక్కనే ఉన్న పంపుహౌస్‌కు చేరుకొని దానిని ప్రారంభించి రోడ్డు మార్గం గుం డా గుండంపల్లి మీదుగా దిలావర్పూర్ సమీపం లో ఉన్న మరో పంపుహౌస్‌కు వెళ్తారని తెలిపారు. అక్కడ సాగునీటిని కాల్వల్లోకి విడుదల చేస్తారని చెప్పారు. అక్కడే కాసేపు కొంత మంది రైతులతో సమావేశం నిర్వహిస్తారని తెలిపారు.
గుండంపల్లి నుంచి దిలావర్పూర్ వరకు ఉన్న రోడ్డు మార్గా న్ని కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. వివిధ శాఖల అధికారులు అందుబాటులో ఉండి ఏర్పాట్లను పూర్తి చేయాలని తెలిపారు. అదేవిధంగా ప్యాకేజీ 27(శ్రీలక్ష్మీ నరసింహస్వామి లిఫ్ట్ ఇరిగేషన్‌కు) ట్రయల్ రన్ చేసి చూడాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఎక్కడ కూడా ఇబ్బందులు కలుగకుం డా అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. గుండంపల్లిలో కేటీఆర్ వెళ్లే రోడ్డు మార్గాన్ని అందంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్, ఇరిగేషన్ ఈఈ రామరావు, బీఆర్ఎస్ మండలా ధ్యక్షుడు కొమ్ముల దేవేందర్‌రెడ్డి, జిల్లా రైతుబంధు సమితి సభ్యులు ఏలాల చిన్నరెడ్డి,జడ్పీటీసీ రమణారెడ్డి, కోడే నవీన్,ఎంపీడీవో మోహన్, తహసీల్దార్ సరిత,ఎంపీవో అజీజ్‌ఖాన్,ఎంపీవో దివ్యారెడ్డి, ఆర్ఐ సంతోష్‌కుమార్, జీపీ కార్యదర్శి స్వాతి, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.