దస్తురాబాద్, జూలై 14 : విద్యార్థులు చదువును మధ్యలో మానేయకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ భావేశ్ మిశ్రా ఆదేశించారు. నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను పరిశీలించారు. సమస్యలు, విద్యార్థుల సంఖ్య, డ్రాపౌట్ సం ఖ్య తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు బోధించి వారి సామర్థ్యాలు పరీక్షించారు.
మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఎస్ఐఆర్ సర్వేను పరిశీలించారు. రెండు రోజుల్లో సర్వే పూర్తి చేయాలని అన్నారు. ఆయన వెంట సర్పంచ్ వర్ధెల్లి గోపాల్, డీఈవో భోజన్న, డీఎంహెచ్వో రాజేందర్, డిప్యూటీ అదనపు పీడీ నాగవర్ధన్, తహసీల్దార్ యాదవ రావు, ఎంపీడీవో సయ్యద్ జావిద్ ఆలీ, ఎంపీవో రమేశ్ రెడ్డి, ఎంఈవో గంగాధర్, ఎస్వో తిరుమల ఉన్నారు.
కడెం, జూలై 14 : విద్యార్థులు చదువుకొని ఉన్నత స్థానంలో నిలవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ.. రోజు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నారో? లేదో తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ ఖాజా మొయినుద్దీన్, ఎంపీడీవో అరుణ, ఎంఈవో శ్రీనివాస్ రెడ్డి, వైద్యులు స్వర్ణరెడ్డి, శివ కుమార్, ఎంపీవో శ్రీనివాస్, ఎస్వో విమల, ఆర్ఐ శారద తదితరులు ఉన్నారు.