తాంసి, ఆగస్టు 23 : ఆదిలాబాద్ జిల్లాలో శనివారం పొలాల అమావాస్య కనుల పండువగా కొనసాగింది. తాంసి మండల కేంద్రంలో ఎమ్మెల్యే అని ల్ జాదవ్, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్లు కలిసి ఎద్దుల జాతర కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశం లో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతాంగంపై గౌరవం పెంచేలా ఇలాంటి పండుగలు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
బసవన్న పండుగ సమావేశంలో గ్రంథాలయ చైర్మన్ నరసయ్య మాట్లాడుతూ.. జై కాంగ్రెస్ అని అనడంతో ఒకసారిగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు జై తెలంగాణ.. జై కేసీఆర్.. అంటూ పలుమార్లు నినదించారు. గ్రామస్తులు బసవన్నల కు నైవేద్యాలు సమర్పించారు. వందలాది ఎద్దులు రంగురంగుల జూలు, పూలదండలతో అలంకరించి ఊరేగింపులో పాల్గొనగా ప్రతిభ కనబరిచిన రైతులకు నగదు బహుమతి అందించారు.
అవాంఛనీ య ఘటనలు జరగకుండా సీఐలు ఫణిధర్, ప్రేమ్‌కుమార్, ఎస్సై జీవన్‌రెడ్డి, రాధిక బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి, ఆద్య కళా మ్యూజియం జయధీర్ తిరుమలరావు, గ్రంథాలయ చైర్మన్ నర్సయ్య, సాయి వై కుంఠ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్ యాదవ్, మాజీ ఎంపీపీ మంజుల శ్రీధర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ తాటిపెళ్లి రాజు, మాజీ సర్పంచ్ స్వప్న, ఎమ్మార్వో లక్ష్మీ, ఎంపీడీవో మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.