కాగజ్‌నగర్ ఎస్పీఎం కాలనీ, ఫిబ్రవరి 28: కాగజ్‌నగర్ పట్టణంలోని విద్యాసంస్థల్లో బుధవారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కాగజ్‌నగర్ పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో సైన్స్‌ఫేర్ నిర్వహించగా ముఖ్యఅతిథిగా కాగజ్‌నగర్ టౌన్ ఎస్‌హెచ్‌వో శంకరయ్య హాజరై మాట్లాడారు. కుటుంబ వ్యవస్థ గురించి పిల్లలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్న శ్రీ చైతన్య యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రాధారేష్మీజయన్, అకడమిక్ డీన్ లింగాల శ్రీధర్, ప్రైమరీ ఇన్చార్జి మహిమాకుమారి, ప్రీ ప్రైమరీ ఇన్చార్జి హేమలత, ఏవో అవినాశ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కాగజ్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా.లక్ష్మీనరసింహం మాట్లాడుతూ.. రామన్ ఫలితాన్ని నిత్యజీవితంలో వివిధ రంగాల్లో ఉపాయోగించుకుంటున్నామని తెలిపారు. ప్రొఫెసర్ శారద మాట్లాడుతూ.. విద్యార్థి దశనుంచే శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు రాజేశ్వర్, జనార్దన్, దేవేందర్, వెంకటేశం, రోజ్మేరి, కృష్ణవేణి, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆలోచనకు రూపమే నూతన ప్రాజెక్టులు
పెంచికల్పేట్, ఫిబ్రవరి 28 విద్యార్థులకు వచ్చిన ఆలోచనలకు రూపమే వివిధ ప్రాజెక్టుల తయారీ అని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయనిర్మల పేర్కొన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల, కస్తూర్బా విద్యాలయంలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా విజ్ఞానమేళా నిర్వహించారు. ముందుగా సైన్స్ పితామహుడు సీవీ రామన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం సైన్స్ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు తయారుచేసిన వివిధ ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఉపాధ్యాయులు యాదగిరి, బడే సాయబ్, సుజాత, నగేశ్, కళావతి, లక్ష్మి, భారతి, శ్రీధర్, రమాదేవి పాల్గొన్నారు.
కాగజ్‌నగర్ టౌన్ , ఫిబ్రవరి 28: పట్టణంలోని జడ్పీఎస్ఎస్ , అరెగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలల్లో బుధవారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పెట్రోల్‌పంప్, ఆరెగూడ పాఠశాలల్లో జిల్లా సైన్స్ అధికారి కటుకం మధుకర్ హాజరై మాట్లాడారు. విద్యార్థుల్లో సైన్స్పట్ల ఆసక్తిని కలిగించడానికి సైన్స్‌ఫేర్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఉపాధ్యాయులు సైన్స్‌కు సంబంధించి ప్రయోగాలు, ప్రాజెక్టులను విద్యార్థులతో తయారు చేయించాలని సూచించారు.
విద్యార్థులు సీవీరామన్ను ఆదర్శంగా తీసుకుని ఉన్నతమైన స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు సైన్స్ క్విజ్ పోటీలు నిర్వహించారు. అంతకు ముందు సీవీ రామన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా సైన్స్ అధికారి , సైన్స్ ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో హెచ్ఎంలు వెంకటరాజయ్య, పర్శ చంద్రశేఖర్, ఉపాధ్యాయులు మామిడాల తిరుపతయ్య, రోజారమణి, కేశవ్, అనీస్హైమద్, అనిత, రాజేశం, రమేశ్, శారద, సీఆర్పీ తుకారాం తదితరులు పాల్గొన్నారు.