నార్నూర్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ లు ( BC Reservations ) కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రాష్ట్ర బంద్ పిలుపులో భాగంగా శనివారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో బంద్ (BC Bandu Success ) విజయవంతమయింది. ఆయా పార్టీ శ్రేణులు, సంఘాల నాయకులు బంద్కు మద్దతు ప్రకటించారు. విద్య, వ్యాపార, వాణిజ్య, అన్ని వర్గాలు బంద్ కు సంపూర్ణంగా మద్దతు తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ ఆడే సురేష్, సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి బానోత్ గజానంద్ నాయక్, మాజీ జడ్పీటీసీలు హేమలత బ్రిజ్జిలాల్, రూపావంతి జ్ఞానోబా పుష్కర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు లోకండే దేవరావ్, బీజేపీ మండల అధ్యక్షుడు రాథోడ్ బిక్షపతి, నాయకులు ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ కైలాస్, మాజీ అధ్యక్షుడు ప్రకాష్, సహకార సంఘం డైరెక్టర్ దుర్గే కాంతారావ్, గుంజ చిన్నయ్య, దస్తగిరి, నాసిర్, సంతోష్, అన్నాభావ్ సాటే కమిటీ మండల అధ్యక్షుడు కోరల మహేందర్, మాజీ ఎంపీటీసీ రాథోడ్ రమేష్, హైమద్, ఆడే దిగంబర్, రాథోడ్ శివాజీ తదితరులు పాల్గొన్నారు.