నార్నూర్, జూలై 29 : నాగ పంచమి వేడుకలను మంగళవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్, గాదిగూడ మండలంలో ప్రజలు నాగ పంచమి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పాము పుట్టలలో పాలు పోసి పేలాలను నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామీణ పల్లెల్లో చెట్ల కొమ్మలకు ఊయల కట్టి సాంస్కృతిక పాటలు పాడుతూ సందడి చేశారు.
అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి పుట్టలో పాలు పోసి పూజలు నిర్వహించారు. శివుని ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.