భైంసా, జనవరి 29 : భైంసా పట్టణాభివృద్ధికి తనవంతు కృషి చేస్తున్నానని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. పట్టణంలోని కుంట ఏరియా లో రూ.45 లక్షలతో మైనార్టీ షాదీఖానాకు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. పట్టణంలో ఇప్పటికే స్ట్రీట్ లైట్లు, పార్కు, మినీ స్టేడియం, శ్మశాన వాటిక వం టివి నిర్మించామని పేర్కొన్నారు. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తనవంతు సహా య సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జాబీర్ అహ్మద్, 1వ వార్డు కౌన్సిలర్ ఫయాజుల్లాఖాన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణ, వైస్ చైర్మన్ ఆసిఫ్, టీఆర్ఎస్ నాయకులు ఫారూఖ్ హైమద్, వాసే, అహ్మద్, నాయకులు పాల్గొన్నారు.
కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ వేతనాలు రూ.26 వేలకు పెంచాలని, వారిని పర్మినెంట్ చే యాలని కోరుతూ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ఎ మ్మెల్యే విఠల్ రెడ్డికి వినతి పత్రం అందించారు. హరిత మా ట్లాడుతూ.. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరారు. పీఎఫ్, ఈఎస్ఐ గుర్తింపు కార్డులు ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ కా ర్యక్రమంలో గంగామణి, గంగాసాగర, మౌనిక, శీల, రుక్మవ్వ, అనురాధ, గౌరబీ పాల్గొన్నారు.
లోకేశ్వరం, జనవరి, 29 : గౌతమ బుద్ధుడి బోధనలు ఆచరణీయమని డాక్టర్ భీంరావ్ యశ్వంత్ రావు అంబేద్కర్ అన్నారు. మండలంలోని కనకాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన 25 అడుగుల భగవాన్ బుద్ధ మూర్తి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. బౌద్ధమతం ప్రజ్ఞ, కరుణ, సమతలను బోధిస్తుందన్నారు. ఇంతటి మహాకార్యానికి శ్రీకారం చుట్టిన గ్రామవాసులకు, అందుకు సహకరించిన స్థానిక ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి మాట్లాడుతూ.. మానవాళికి శాంతి సందేశం అందించిన శాంతి దూత గౌతమ బుద్ధుడు అని అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అంబేద్కర్ మనవడు డాక్టర్ భీంరావ్ అంబేద్కర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సమత సుదర్శన్, భారతీయ బౌద్ధ మత రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ గడపాలే, సర్పంచ్ నరేశ్, ఎంపీటీసీ ఇందిరా గ్రామ వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.