ముథోల్, మే 21 : తెలంగాణ సర్కారు ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేసిందని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. ముథోల్ మండల కేంద్రంలోని సాయిమాధవ్నగర్ కాలనీలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన మార్కండేయ ఆలయ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజ లు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆలయానికి రూ.10 లక్షలు మంజూరుచేసిందన్నారు. ఇప్పటికే ముథోల్‌లోని ముక్తాదేవి, పశుపతినాథ్ శివాలయం, మార్కండేయ ఆలయాలకు దాదాపు రూ. 70 లక్షలు మంజూరు చేసిందని గుర్తుచేశారు. దీంతో పాటు కాలనీల్లో సైతం రూ.2 కోట్లతో సీసీ రోడ్డు పనులు చేసినట్లు వెల్లడించారు. ముథోల్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. మార్కండేయ ఆలయానికి ప్రహారీ, కల్యాణ మం డపాన్ని మంజూరు చేసేలా చూడాలని సంఘం సభ్యులు ఎమ్మెల్యేను కోరారు.
అందుకు ఆయన స్పందించి, నిధుల మంజూరుకు కృషిచేస్తానని హ మీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షుడు నర్సయ్య, సభ్యుడు గణేశ్ శాలువాతో ఘనంగా సత్కరించా రు. అంతకుముందు మార్కండేయ ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి, శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముథో ల్ ఎంపీపీ అయేషా అఫ్రోజ్ ఖాన్, ముథోల్ సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ సురేందర్ రెడ్డి, పద్మశాలి సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, బ్రహ్మణ్గావ్ సర్పంచ్ రాంరెడ్డి ,పద్మశాలి సంఘం పట్టణాధ్యక్షుడు ప్యాదరి నర్సయ్య, సంఘం సభ్యులు గణేశ్, సురేందర్, గంగాధర్, కో-ఆప్షన్ సభ్యుడు మగ్దూమ్, ఎస్ఐ సాయికిరణ్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
సీఎం కప్ జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన 60 మంది క్రీడాకారులకు ఎమ్మెల్యే తన సొంత డబ్బులతో తయారు చేయించిన టీ షర్టులను ముథోల్‌లోని జడ్పీ హైస్కూల్లో అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. యువత క్రీడా స్ఫూర్తితో మరింత ముందుకుసాగాలని సూచించారు. జిల్లాస్థాయిలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. క్రీడాకారులకు తమవంతు సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు అప్రోజ్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.
బాసర, మే 21 : బాసర మండల కేంద్రంలోని సైలని బాబా దర్గ వద్ద నిర్వహించిన ఉర్సులో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి పాల్గొన్నారు. ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యేను ముస్మింలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలు హైమద్ హుస్సేన్ బాబా, సర్పంచ్ లక్ష్మణ్‌రావు తదితరులున్నారు.