కుభీర్ : ప్రతి ఒక్కరికి ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కలిగి ఉండడం ఎంతో ముఖ్యమని ఎంపీడీవో సాగర్ రెడ్డి ( MPDO Sagar Reddy ) సూచించారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం ధార్ కుభీర్‌లో (Dhar Kubheer ) ఆర్థిక అక్షరాస్యతపై గురువారం అవగాహన ( Aware ) కల్పించారు. ఆయన మాట్లాడుతూ మనం కష్టపడి సంపాదించిన వాటికి విలువ, గుర్తింపు ఆర్థిక అక్షరాస్యతతోనే సాధ్యమని పేర్కొన్నారు. భవిష్యత్ ప్రణాళికలను అది కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
నానాటికి పెరిగిపోతున్న సైబర్ నేరాలు( Cyber Crimes ) , మోసాలపై గ్రామీణ ప్రాంత ప్రజలు అవగాహనను పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అన్ని రకాల పథకాలు, రుణాలు, బీమా సదుపాయాలను వివరించారు. యువత, మహిళలు, రైతులు తక్కువ వడ్డీతో అందించే రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
బ్యాంకుల ద్వారా లభించే జన సురక్ష, పీఎం విశ్వకర్మ యోజన, ముద్ర, పీఎంఈజీపీ , పీఎం జీవనజ్యోతి, అటల్ పెన్షన్ యోజన లాంటి రుణాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జీవన విధానంలో పొదుపు అనేది ఎంతో ముఖ్యమైందని పొదుపును అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శివరాజ్, ఎంపీవో మోహన్ సింగ్, ఆయా శాఖల అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.