Harish Rao | సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైలులో అక్రమ కేసులతో అరెస్టు అయిన 13 మంది మెదక్ బీఆర్ఎస్ కార్యకర్తలను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. అనంతరం జైలు ఆవరణలో హరీష్ రావు మాట్లాడుతూ.. మెదక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ, రాత్రి 12:30 గంటలకు 4 కార్ల కాన్వాయ్‌తో వార్డులు ఎందుకు తిరిగాడు..? అని డీజేపీ శివధర్ రెడ్డిపై ఫైర్ అయ్యారు.
5 గంటలకు ఎన్నికల ప్రచారం అయిపోయినా.. రాత్రి 12:30 గంటలకు పదుల సంఖ్యలో ఫాలోవర్లతో వెళ్ళిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మీద ఇతర కాంగ్రెస్ నాయకుల మీద కేసులు ఎందుకు పెట్టలేదు..? ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..? డీఎస్పీ దగ్గరుండి ఎందుకు డబ్బులు పంచిచ్చాడో సమాధానం చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
మైనంపల్లి రోహిత్ కారును తన కాలుపై నుండి తీసుకుపోయాడని మా బీఆర్ఎస్ కార్యకర్త ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు ఎందుకు కేసు నమోదు చేయలేదు..? సమాధానం చెప్పాలన్నారు.
బీఆర్ఎస్ కార్యకర్త ఆటోపై ఇద్దరు కాంగ్రెస్ గుండాలు పెట్రోల్ చల్లి అర్థరాత్రి తగలబెడితే, వీడియోలు, సాక్ష్యాధారాలతో సహా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే 3 గంటలు కూర్చున్నా ఎందుకు దరఖాస్తు తీసుకోలేదు? ఎందుకు ఈ నిమిషం వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదో సమాధానం చెప్పాలి. సీఐతో, డీఎస్పీ, జిల్లా ఎస్పీతో మాట్లాడినం. ఆటో తగలబెట్టిన వ్యక్తుల విజువల్స్ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంటే.. ఫిర్యాదు చేస్తే ఇప్పటికీ 48 గంటలైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. గూండాలను అరెస్ట్ చేయలేదు. దీనికి డీజీపీ శివధర్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. నిన్న రాత్రి బీఆర్ఎస్ కార్యకర్తకు సంబంధించిన ఒక టిప్పర్‌ను కాంగ్రెస్ గుండాలు పెట్రోల్ పోసి తగలబెట్టారు
పోలీసులను అడ్డగోలుగా తిడితే అరెస్ట్ చేసే దమ్ములేదు..
డీజీపీ శివధర్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఖాకీ బుక్ అందరికి సమానమే అని కథలు చెబుతున్నవ్ కదా.. మరి ఇప్పుడు ఆ ఖాకీ బుక్ ఏం చేస్తుంది? అని అడుగుతున్నా. డీజీపీ చట్టముండదా..? అని ప్రశ్నించారు.
ఒక కాంగ్రెస్ నాయకుడేమో నేను నోటితో ఉచ్చరించలేని బూతులతో పోలీసులను అడ్డగోలుగా తిడితే నీకు అరెస్ట్ చేసే దమ్ములేదు. ఇవాళ మా కార్యకర్తల ఇండ్ల మీద దాడి చేస్తరు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసే దమ్ములేదు.. కేసు పెట్టవు.. ఎఫ్ఐఆర్ నమోదు కాదు. ఆటో తగలబెడితే.. మా టిప్పర్ తగలబెడితే ఎఫ్ఐఆర్ నమోదు కాదు. మా కార్యకర్త కాళ్ల మీదకెళ్లి కారు ఎక్కిచ్చి దాడి చేస్తే.. మా కార్యకర్త వెళ్లి ఫిర్యాదు చేస్తే తీసుకోవు.. ఈ నిమిషానికి కూడా ఎఫ్ఐఆర్ కాదు. అంటే ఖాకీ బుక్ కాంగ్రెస్ పార్టీకి చుట్టమైందా..? ఏం శివధర్ రెడ్డి ప్రశ్నిస్తే కేసులు పెడతవా..? ఎంతమందిపై పెడతవు.. క్యాతన్‌పల్లిలో మా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మీద, నలుగురు మీద కేసులు పెడ్తవు. ఆమనగల్లో బీఆర్ఎస్ నేతలపై కేసులు పెడ్తవు.. అని ప్రశ్నించారు.
నేను జైలులో పరామర్శించిన అఖిల్ అనే కార్యకర్త చెబుతున్నాడు.. ఆయన ఎన్నికల రోజు పోలింగ్ బూత్‌లో బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్‌గా కూర్చున్నడు. ఎమ్మెల్యే పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఎవడ్రా.. బీఆర్ఎస్ ఏజెంటేనా.. ? అని అడిగి బిడ్డా నీ సంగతి చెప్తా.. బయటకొచ్చినంక నిన్ను చంపేస్తా అని పోలింగ్ అధికారుల సమక్షంలో మా ఏజెంట్‌ను బెదిరిస్తే కేసులుండవు. ముందే బెదిరిస్తే కేసులుండవు. ఇదేనా డీజేపీగా శివధర్ రెడ్డి నువ్వు అమలు చేసే చట్టం అని ప్రశ్నించారు.
ఒక బీజేపీ నాయకుడేమో పోలీసులను గల్లా పట్టి లాక్కురండి.. తన్నండి పోలీసోళ్లను అంటే కేసు పెట్టవు.. అరెస్ట్ చేసే దమ్ము లేదు నీకు. ఖాకీ బుక్ కాంగ్రెస్ పార్టీకి చుట్టమైందా? అని హరీష్ రావు మండిపడ్డారు. హరీష్ రావు వెంట ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్ రావు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పలువురు నేతలున్నారు.
Karthika Deepam | కార్తీక దీపం రెండో సీజన్ 600 ఎపిసోడ్లు పూర్తి.. ప్రత్యేక ప్రోమోతో సంబరాలు
Tirumala | వేసవి సెలవుల్లో తిరుమలకు పెరగనున్న రద్దీ.. వేగంగా దర్శనాలు పూర్తయ్యేలా టీటీడీ ఏర్పాట్లు