మంచిర్యాల టౌన్, నవంబర్ 11 : మంచిర్యాల పట్టణంలో అభివృద్ధి పేరిట యంత్రాంగం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నది. నిబంధనలు తుంగలో తొక్కి.. టెండ ర్లు పిలవకుండానే పనులు చేపట్టడం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటికి మొన్న ఐబీ చౌరస్తాలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను టెండర్లు పిలవకుండానే కొబ్బరికాయలు కొట్టిమరీ కూల్చివేశారు. రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరించారంటూ ఎవరెన్ని విమర్శలు చేసినా అధికారులు కనీసం ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. తాజాగా.. మార్కెట్‌రోడ్ వెడల్పు పేరిట ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపడుతున్నారు.
ఎవరేమునుకున్నా ఈ రోడ్‌ను వెడల్పు చేసి తీరుతామని, సెట్‌బ్యాక్ లేకుండా నిర్మించిన భవనాలను తొలగిస్తామని ఎమ్మెల్యే పీఎస్సార్ స్పష్టం చేశారు. దసరా పండుగ సమయంలో రోడ్డుకు ఇరువైపులా మార్కింగ్ చేయగా, జేసీబీలు కొంత మేర నిర్మాణాలను కూల్చివేశాయి. పండుగల సమయం కావడంతో వ్యాపారస్తుల కోసం కాస్త విరా మం ఇచ్చారు. దీపావళిలోగా సెట్ బ్యాక్లను తొలగించుకోవాలని షాప్లయాజమానులకే అవకాశం ఇచ్చారు.
తాజాగా.. అర్చన టెక్స్ చౌరస్తా నుంచి మార్కెట్ వైపు జేసీబీతో రోడ్డుకు ఇరువైపులా తవ్వకాలు చేపడుతున్నా రు. పెద్ద పెద్ద కాలువలు తీస్తున్నారు. నిబంధనలు పా టించకుండా.. టెండర్లు పిలవకుండానే తవ్వుతున్నట్లు సమాచారం. గవర్నమెంట్ ఏ పని చేయాలన్నా నిధులు కేటాయించి, టెండర్లు పిలిచాక గానీ తట్టడు మట్టి తీ యరు. అలాంటిది ఎలాంటి టెండర్ లేకుండా ఈ పను లు ఎలా చేస్తున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. అసలు టెండర్లు ఎప్పుడు పిలిచారు.. టెండర్ ఎవరు దక్కించుకున్నారు.. అంటే మున్సిపల్ అధికారుల నుంచి సమాధానం చెప్పే నాథుడే కరువయ్యాడు. కాలువ కోసం తీసిన మట్టిని టిప్పర్ లారీలతో ఎక్కడికో తరలించుకుపోతున్నారు. అంటే అనధికారికంగా ఎవరికో కాంట్రాక్ట్ అప్పగించారని అర్థమవుతున్నది.
అసలు ఈ కాలువ ఎందుకు తవ్వుతున్నారు, ఇక్కడ ఏం నిర్మిస్తారు.. అన్న విషయాలు రహస్యంగా ఉంటున్నాయి. ఒకవేళ డ్రైనేజీ నిర్మించాలనుకుంటే ఆక్రమణలు తొలగించిన మార్కెట్ రోడ్డు పొడవునా నిర్మించాలి. కానీ ఈ కాలువ కేవలం అంజలి డ్రెస్సెస్ దగ్గర నుంచి అర్చనటెక్స్, సింధూరి సి ల్క్స్, దాని పక్కన ఉన్న భవనం వరకు తీసి, అక్కడి నుంచి పశ్చిమం వైపునకు మళ్లించారు. ఈ విషయమై స్పష్టత కోసం ‘నమస్తే తెలంగాణ’ మున్సిపల్ చైర్మన్ ఉ ప్పలయ్య, కమిషనర్ మారుతీ ప్రసాద్, ఎంఈ మసూద్లను సంప్రదించగా స్పందించ లేదు. ‘ప్రజా పాలన’ లో నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపడుతుంటే కల్లుండీ చూడలేకపోతున్నారనే వి మర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ విషయంలోనైనా జిల్లా అధికారులు జోక్యం చేసుకుంటారా లేక చూసిచూడనట్లు మిన్నకుండిపోతారా వేచి చూడాల్సి ఉన్నది.