ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి, ఇతర పథకాల ఫలితంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) పంచాయతీ అద్భుతమైన ప్రగతి సాధించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం మంత్రి సభలో మాట్లాడారు.
ముక్రా(కే) గ్రామానికి చెందిన ఫొటోలను సభ్యులకు చూపించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వల్ల పల్లెలు ప్రగతిపథంలో దూసుకుపోతున్నాయని పేర్కొన్నారు.
– ఆదిలాబాద్, ఆగస్టు 5(నమస్తే తెలంగాణ)