నార్నూర్ : అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పంచాయతీ అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీడీవో పుల్లారావ్ ( MPDO Pulla Rao ) అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మాన్కాపూర్( Mankapur ) గ్రామంలో బుధవారం సర్పంచ్ తోడసం రేణుక బాయి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేస్తేనే పంచాయతీని అభివృద్ధి చేసుకోవచ్చని సూచించారు.
వర్షాకాలంలో వ్యాధులు ప్రభలకుండా ముందస్తుగా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమృద్ధిగా వర్షాలు కురిస్తేనే విత్తనాలు విత్తుకోవాలని, వ్యవసాయ అధికారులు సలహా సూచనలు పాటించాలని కోరారు. ఈ సమావేశంలో పంచాయతీ కార్యదర్శి సాయి క్రిష్ణ, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ వైస్ మాజీ చైర్మన్ తోడసం నాగోరావు, మాజీ ఎంపీపీ మెస్రం రూప్ దేవ్, మాజీ సర్పంచ్ రాథోడ్ సావీందర్, ఉప సర్పంచ్ రాథోడ్ గణేష్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.