Manav Suthar: కౌంటీ క్రికెట్లోకి మానవ్ సుతార్.. స్పిన్నర్‌తో డీల్ కుదుర్చుకున్న వార్విక్షైర్
Manav Suthar: మానవ్ సుతార్.. కౌంటీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. వార్విక్షైర్తో అతను డీల్ చేసుకున్నాడు. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టెస్టులో సుతార్ అద్భుతంగా బౌలింగ్ చేసిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో అతను ఏడు వికెట్లు తీసుకున్నాడు.
ముంబై: ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో అద్భుత ప్రదర్శన ఇచ్చిన స్పిన్నర్ మానవ్ సుతార్(Manav Suthar).. ఇప్పుడు ఇంగ్లండ్ కౌంటీ జట్టు వార్విక్షైర్తో డీల్ కుదుర్చుకున్నాడు. కౌంటీ టీమ్‌తో స్వల్ప కాలిక ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఆఫ్ఘన్‌తో జరిగిన మ్యాచ్‌లో టెస్టు అరంగేట్రం చేసిన రాజస్థానీ బౌలర్.. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసి ప్రత్యర్థులను దెబ్బతీశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో అతను తన ఖాతాలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే వేసుకున్నాడు. వార్విక్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ మానవ్ సుతార్‌తో ఒప్పందంపై ప్రకటన చేసింది. షార్ట్ టర్మ్ కాంట్రాక్టు కుదుర్చుకున్నట్లు ఆ కౌంటీ పేర్కొన్నది.
రోతేసే కౌంటీ చాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగే తర్వాత రెండు రౌండ్ల మ్యాచ్‌లకు సుతార్ ఆ జట్టుకు అందుబాటులో ఉండనున్నాడు. సుతార్‌కు ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనూ మంచి రికార్డు ఉన్నది. 29 మ్యాచుల్లో అతను 129 వికెట్లను తీసుకున్నాడు. ఇంగ్లండ్‌లో జరిగే కౌంటీల్లో ఆడడం వల్లే మానవ్ సుతార్‌కు మరింత అంతర్జాతీయ అనుభవం రానున్నది.
ఆగస్టులో శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌కు ముందు సుతార్ కౌంటీల్లో ఆడనున్నాడు. మానవ్ సుతార్ మా జట్టుతో చేరడం సంతోషంగా ఉందని వార్విక్షైర్ పర్ఫార్మెన్స్ డైరెక్టర్ జేమ్స్ థామస్ తెలిపారు. యార్క్‌షైర్, సోమర్‌సెట్‌తో జరిగే మ్యాచుల్లో సుతార్ ఆడనున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

