పెంచికల్పేట్, జూన్ 14 : పెంచికల్పేట్ మండల కేంద్రంలోని ఎలపల్లి ప్ర భుత్వ ప్రాథమిక పాఠశాలకు మూడు భవనాలున్నాయి. రెండు భవనాల్లో పాఠశాల.., మరో భవనంలో అంగన్వాడీ కేంద్రం కొనసాగుతున్నది. పాఠశాలలో నుంచి 5వ తరగతి వరకు దాదాపు 45 మంది విద్యార్థులు చదువుకుంటుండగా, ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. అంగన్వాడీ కేంద్రంలో ప్రీ ప్రైమరీ విద్యార్థులు దాదాపు 25 మంది, ఒక టీచర్, ఆయా విధులు నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలకు 40 ఏండ్ల చరిత్ర ఉన్నది. అయితే నాలుగు రో జుల క్రితం హుటాహుటినా ఎంపీడీవో కార్యాలయంగా మార్చారు. రెండు భవనాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఒక భవనంలో పంచాయతీ విభాగం ఎంపీడీవో, మరో భవనంలో ఎన్ఆర్ఈజీఎస్ విభాగం ఏపీవో కార్యకలాపాలు సాగిస్తున్నారు. రెండు విభాగాలు కలిసి దాదాపు 10 మంది సిబ్బంది తోపాటు, 12 మంది పంచాయతీ కార్యదర్శులు, 12 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు నిత్యం ప్రజా అవసరాలు, సమస్యలతో వచ్చే జనాలతో కార్యాలయం సందడితో నిండిపోతున్నది. ఇలా ఉండే ఈ ఆవరణలో పాఠశాల
నిర్వహణ సాధ్యమవుతుందా..? అధికారులు భవన సమస్యలను తీర్చి అకడే సర్దుబాటు చేస్తారా..? లేక సంజీవనగర్ ప్రాథమిక పాఠశాలలోని గదులకు తరలిస్తారా..? అనే సందేహంలో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానోపాధ్యాయుడికి సమాచారం ఇవ్వకుండానే ఎంఈవో రమేశ్ బాబు పాఠశాలలోని సామగ్రిని పక భవనంలోని అంగన్వాడీ కేంద్రానికి తరలించి, మౌఖిక ఆదేశాలతో ఎంపీడీవో కార్యాలయాన్ని పాఠశాలలోకి అనుమతించారని పలువరు అంటున్నారు. ఎలపల్లి ప్రాథమిక పాఠశాలను సంజీవనగర్ పాఠశాలలోకి తరలించే ఏర్పాట్లలో నిమగ్నమైనట్లు సమాచారం. కానీ, తల్లిదండ్రులు మాత్రం పాఠశాలను వేరే ప్రాంతానికి తరలించకుండా ఇకడే నిర్వహించేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.