బోథ్, అక్టోబర్ 25 : బీఆర్ఎస్ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలతో ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతున్నదని ఎంపీపీ తుల శ్రీనివాస్ అన్నారు. మండలంలోని నాగపూర్, మందబొగూడ, అందూర్, బీర్లాగొంది గ్రామాల్లో బుధవారం బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ తుల శ్రీనివాస్ మాట్లాడుతూ నాగపూర్‌లో రూ.కోటితో రోడ్డు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఎన్నికల అనంతరం రోడ్డు పూర్తి చేస్తామన్నారు.
అటవీ ప్రాంతంలో భూముల్లో పంటలు పండకపోతే సీఎం కేసీఆర్ మీ కష్టాలను గుర్తించి పోడు పట్టాలు ఇచ్చి, భూములో బోర్లు వేయించిన పెద్ద మనసు కేసీఆర్‌ది అన్నారు. కష్టాలు తెలిసిన నాయకుడు, మీ ఇంటి బిడ్డ జాదవ్ అనిల్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, సురేందర్ యాదవ్, కదం ప్రశాంత్, ఆదివాసీ గ్రామ పటేళ్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.
ఇచ్చోడ, అక్టోబర్ 25 : మండలంలోని ఇస్లాంనగర్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా పార్టీ మ్యానిఫెస్టో గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి జాదవ్ అనిల్‌ను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రీతమ్ రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణారెడ్డి, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు ముండే పాండురంగ్, ఎంపీటీసీ గాడ్గె సుభాష్, మాజీ మండలాధ్యక్షుడు మెరాజ్ అహ్మద్, సర్పంచ్ అమీనా బీ ఫరీద్, మాజీ ఎంపీటీసీ నార్వాడే రమేశ్, షాబీర్, ఇచ్చోడ ఉపసర్పంచ్ శిరీష్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ దయాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి, ఎంపీటీసీ వెంకటేశ్, పురుషోత్తం రెడ్డి, గోనె లక్ష్మి, పాండురంగ, జాదవ్ మనోహర్, సచిన్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బోథ్, అక్టోబర్ 25 : బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ విజయాన్ని ఆకాంక్షిస్తూ బీఆర్ఎస్ నాయకులు మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. మళ్లీ అధికారంలోకి వస్తే రూ.400 గ్యాస్ సిలిండర్, బీమా పథకం, పింఛన్ల పెంపు తదితర పథకాలను అమలు చేస్తున్నదని ఓటర్లకు వివరించారు. కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా జాదవ్ అనిల్‌ను గెలిపించాలని కోరారు. ప్రచారంలో బోథ్ జడ్పీటీసీ సంధ్యారాణి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ బీ నారాయణ రెడ్డి, ఆత్మ చైర్మన్ ఎం సుభాష్, గ్రంథాలయ డైరెక్టర్ రమణ గౌడ్, రాజు, రఫీ, బుచ్చన్న, దేవీదాస్ పాల్గొన్నారు.
కోల్హారిలో..
బజార్హత్నూర్, అక్టోబర్ 25 : రాష్ట్రంలో పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చూసి పార్టీని ఆదరించాలని పార్టీ నాయకుడు చట్ల గజ్జయ్య అన్నారు. బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ గెలుపును కోరుతూ మండలంలోని కోల్హారి గ్రామంలో గ్రామ పటేల్ శంకర్ ఆధ్వర్యంలో నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు ఇంటింటికీ అందుతున్న ఫలాలపై కరపత్రాల ద్వారా వివరించారు. కార్యక్రమంలో నాయకులు జ్ఞానేశ్వర్, శేఖర్, చైతన్య, రమణ, మహేందర్‌గౌడ్, భోజన్న, బంజ విశ్వేశ్వర్, డుబ్బుల మల్లేశ్, మడిగే రమేశ్, యోగి, ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.