చెన్నూర్, సెప్టెంబర్ 11: చెన్నూర్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు ‘అప్పుడే మంచిగుండే’ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆదేశాల మేరకు పట్టణంలోని 6వ వార్డులో ఇంటింటా తిరుగుతూ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు.
కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకుడు రాజా రమేశ్, నాయకులు రాంలాల్ గిల్డా, ఆరీఫ్, మానిశెట్టి శ్రీనివాస్, లక్ష్మణ్, రవీందర్, ముత్యా ల సత్యవతి, చీర్ల సత్తెమ్మ, పార్టీ సోషల్ మీడియా వారియర్స్ తదితరులు పాల్గొన్నారు.
చెన్నూర్ రూరల్, సెప్టెంబర్ 11 : కాంగ్రెస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని మాజీ జడ్పీటీసీ మోతె తిరుపతి అన్నారు. గురువారం చెన్నూర్ మండలం దుగ్నెపల్లి, కిష్టంపేటలో ‘అప్పుడే బాగుండే’ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికీ వెళ్లి ఫిర్యాదులు స్వీకరించారు. కిష్టంపేటలో మాజీ సర్పంచ్ బుర్ర రాకేశ్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కేసీఆర్ హయాంలో ఎలాంటి ఇబ్బందులు లేవని, కాంగ్రెస్ రాగానే రైతులు రోడ్డుమీద పడుతున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, రత్న సమ్మిరెడ్డి, బాపు, సోషల్ మీడియా వారియర్స్ పాల్గొన్నారు.