ఎదులాపురం, ఏప్రిల్ 19 : అత్యవసర సమయంలో నిఘా, రక్షణ కోసం మొబైల్ కమాండ్ కంట్రోల్ వాహనం ప్రారంభించామని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్‌కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లాకు కేటాయించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్, సర్వైవ్లెన్స్తో కూడిన మొబైల్ కమాండ్ కంట్రోల్ వాహనాన్ని మంగళవారం స్థానిక పో లీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఆయన జెండా ఊపి ప్రా రంభించారు. ముందుగా ఈ వాహనాన్ని పరిశీలించారు. ప్రత్యేకత, వినియోగం గురించి ఐటీ అండ్ సీఎస్ఐపీ గణేశ్‌ను అడిగి తెలుసుకున్నా రు. అనంతరం మాట్లాడుతూ.. ఈ వాహనం అత్యవసర సమయంలో నిఘా వ్యవస్థను కలిగి ఉందన్నారు.
సమాచార వ్యవస్థను బలోపేతం చేసేలా వీహెచ్ఎఫ్ సెట్లు, కమ్యూనికేషన్ సెట్లను వినియోగించేలా రూపొందించారని వివరించారు. అలాగే 5 సీసీ కెమెరాలు అమర్చారని, రేడియో సిస్టం, మొబైల్ డీవీఆర్ విత్ డిస్ ప్లె, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, అల్లరి మూకలు, గొడవలను అదుపుచేసేందుకు సైరన్‌తో పాటుగా అనేక సదుపాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్, డీఎస్పీలు వెంకటేశ్వరరావు, ఎం విజయ్ కుమార్, ఆర్ఐలు ఏం శ్రీపాల్, డీ వెంకటి, స్పెషల్ బ్రాంచ్ సీఐ జే కృష్ణమూర్తి, ఐటీ అండ్ కమ్యూనికేషన్ ఎస్ఐ పీ గణేశ్, సిబ్బంది పాల్గొన్నారు.