జైనూర్, జనవరి 6 : దేవుగూడ గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ మెస్రం నీలాబాయి కుటుంబ సభ్యులు అధైర్యపడవద్దని, బీఆర్ఎస్ పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం ఆసిఫాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్ జాధవ్‌తో కలిసి నీలాబాయి కుటుంబాన్ని పరామర్శించారు. వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. వైద్యం అందుతున్న తీరుతెన్నులు, ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయ సహకారాలు అందాయా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా పల్లెలు, పట్టణాలు, వసతి గృహాల్లో అడపిల్లలకు కనీస రక్షణ కరవైందని ఆరోపించారు.
ఫలితంగా వందలాది మంది మహిళలు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. నీలాబాయి కుటుంబానికి రూ.2 లక్షల చెక్కు అందజేశారు. అంతకుముందు బీఆర్ఎస్ శ్రేణులు జంగాం చౌరస్తా నుంచి బైకు ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. ఆదివాసీలు సాంప్రదాయబద్ధంగా డప్పులు వాయిస్తూ మంగళహారతులతో గ్రామానికి సాదారంగా ఆహ్వానించారు. గ్రామంలోని గోండు మహిళలు ఎమ్మెల్సీ కవితకు తిలకం దిద్ది, ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. వారితో కలిసి డప్పు చప్పుళ్ల నడుమ సంప్రదాయ నృత్యాలు చేశారు. కవిత ముందు గ్రామ పటేల్ మెస్రం జంగు సమస్యల ఏకరువు పెట్టారు. గ్రామానికి బీటీ రోడ్డు నిర్మించాలని, తాగు, సాగునీటి వసతి కల్పించాలని వినతి పత్రం అందించారు.
అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న జామ్ని మాజీ ఎంపీటీసీ, తెలంగాణ ఉద్యమకారుడు లట్పటే మాధవ్‌ను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మాజీ మేయర్, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్‌సింగ్, ఆదిలాబాద్ మాజీ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, కుమ్రం భీం మనువడు కుమ్ర సోనేరావ్, బీఆర్ఎస్ జిల్లా నాయకురాలు మర్సుకోల సరస్వతి, పీఏసీఎస్ చైర్మన్ కొడప హన్ను పటేల్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఇంతియాజ్ లాలా, ఉపాధ్యక్షుడు ఆత్రం శంకర్ కొలాం, ఇచ్చోడ సీనియర్ నాయకులు గాడ్గె సుభాష్, ఎంపీటీసీల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు కుమ్ర భగవంత్‌రావ్, సర్పంచుల సంఘం మండల మాజీ అధ్యక్షుడు మడావి భీంరావ్, మాజీ సిర్పూర్ (యూ) మండలా అధ్యక్షుడు తొడసం ధర్మరావ్, మాజీ ఎంపీపీ భాగ్యలక్ష్మి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆత్రం భగగవంత్రావ్, లింగాపూర్ మాజీ జడ్పీటీసీ లక్యా, నాయకులు గణపత్, మార్లావాయి సార్మెడి జుగ్నక దేవ్‌రావ్, సర్పంచులు గేడం లక్ష్మణ్, శ్యాంరావ్, మాజీ ఎంపీటీసీ ఆత్రం జుగదిరావ్, నాయకులు పాల్గొన్నారు.
కెరమెరి మీదుగా యాత్ర..
కెరమెరి, జనవరి 6 : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టిన ఓదార్పు యాత్ర కెరమెరి మీదుగా సాగింది. మధ్యాహ్నం 2.30 గంట ల ప్రాంతంలో కెరమెరి చేరుకున్నారు. ముం దుగా కెస్లాగూడలో మహిళలు హారతులతో రోడ్డుపైకి రావడంతో ఎమ్మెల్సీ కవిత వాహ నం దిగి, ప్రజల వద్దకు వచ్చి కరచాలనం చేశారు. మహిళలు ఆప్యాయతతో తిలకం ది ద్ది, శాలువాతో ఘన సన్మానించారు. నాయకులు, కార్యకర్తలు ఆమెను కలిసేందుకు ఒక్కసారిగా తీవ్రస్థాయిలో పోటీ పడ్డారు. మాజీ ఎంపీపీ పెందోర్ మోతీరాం, మాజీ జడ్పీటీసీ సెడ్మకి దుర్పతాబాయి, మండల మాజీ కోఆప్షన్ సభ్యుడు షేక్ ఖుత్బొద్దీన్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ పెందోర్ ఆనంద్‌రావ్, నాయకులు షేక్ యునుస్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
టీబీజీకేఎస్‌కు పూర్వ వైభవం..
రెబ్బెన, జనవరి 6 : సింగరేణిలో తెలంగా ణ బొగ్గు గని కార్మిక సంఘానికి పూర్వ వైభ వం వస్తుందని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నా రు. బెల్లంపల్లి ఏరియా గోలేటిలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన కార్మికుల అత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి హాజరయ్యారు. సిరులవేణి సింగరేణి సంస్థను ప్రైవేట్‌పరం కాకుండా కేసీఆర్ అడ్డుకున్నారని గుర్తుచేశారు. సుమారు 20వేల మందికి డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. స్థానిక నాయకులతో మమేకమై టీబీజీకేఎస్‌ను బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి సురేందర్‌రెడ్డి, ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు, మాజీ మేయర్ రవీందర్‌సింగ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పోటు శ్రీధర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ అజ్మీరా బాబురావ్, మాజీ సర్పంచ్‌లు పోటు సుమలత, తోట లక్ష్మణ్, ఏఎంసీ మాజీ చైర్మన్ పర్లపల్లి వనజ, మాజీ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ, నాయకులు మర్సుకోల సరస్వతి, విజిత్‌రావు, సంపత్, మారిన వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, కార్నాథం వెంకటేశం, సత్యనారాయణ, ఓరం కిరణ్ ,దయాకర్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.