కుభీర్, ఏప్రిల్ 7: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక బీజేపీ చేస్తున్న కుట్రలను తిప్పికొడుదామని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు నిర్మల్ జిల్లా ఇన్చార్జి ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్ పిలుపునిచ్చారు. కుభీర్ మండలం మాలేగావ్ గ్రామంలో పార్టీ ఆత్మీయ సమ్మేళనం మండలాధ్యక్షుడు ఎన్నీల అనిల్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ మాట్లాడుతూ స్వరాష్ట్రంలో ఎన్నో పురాతన ఆలయాలను పునర్నిర్మించుకోవడంతో పాటు కొత్త ఆలయాలను కట్టుకున్నామని తెలిపారు. దేవుడు, మతం, కులం పేరు చెప్పుకొని పబ్బం గడుపుతున్న బీజేపీని పొలిమేరల నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. పిల్లల భవిష్యత్‌ను కూడా ప్రశ్నార్థకం చేస్తూ ఆ పార్టీ నేతలు పేపర్లు లీకు చేస్తున్నారని, వారే బీఆర్ఎస్పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ముందు వారి కుట్రలు సాగబోవని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి మినహా మిగతా పార్టీలకు రాష్ట్రంలో ఓట్లడిగే హక్కు లేదని అన్నారు. ప్రభుత్వాలను కూల్చడం, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనడమే బీజేపీ పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ గ్రామాల్లోకి వస్తున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు.
మహారాష్ట్రలోనూ మనమే: ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి
పొరుగున ఉన్న మహారాష్ట్ర ప్రజలు కూడా మన పథకాలనే కోరుకుంటున్నారని ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అన్నారు. ఇటీవల మహారాష్ట్రలోని నాందేడ్, లోహా జిల్లాల్లో జరిగిన బహిరంగ సభలకు వచ్చిన ప్రజలే ఇందుకు నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ బలోపేతాన్ని అడ్డుకునేందుకు బీజేపీ కుట్రలకు తెరలేపిందని మండిపడ్డారు. చివరకు టెన్త్ పేపర్లు లీక్ చేసేందుకు పూనుకోవడం ఆ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమని దుయ్యబట్టారు. జిల్లా ప్రధాన కార్యదర్శి తూం రాజేశ్వర్, స్థానిక సర్పంచ్ విఠాపూర్ మహిపాల్‌రెడ్డి, వైస్ ఎంపీపీ మొహియొద్దీన్, మాజీ సర్పంచ్ కచ్చకాయల శంకర్, మల్లారెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు న్యాలపట్ల దత్తుగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ రేకుల గంగాచరణ్, మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు దత్తహరి పటేల్, ఏఎంసీచైర్మన్ కందూరి సంతోష్, జాదవ్ దత్తురాం పటేల్, బీఆర్ఎస్ యువజన విభాగం మండలాధ్యక్షుడు శ్రీరాముల రాజేశ్ చారి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ కే రాజన్న, చవాన్ శంకర్, గోనె కళ్యాణ్, తదితరులున్నారు.
ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేకు ఘన స్వాగతం
గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్‌లకు పార్టీ మండల ఉపాధ్యక్షుడు సాయి ప్రసాద్‌రెడ్డి, మాలేగావ్ సర్పంచ్ విఠాపూర్ మహిపాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్ కచ్చకాయల శంకర్, గ్రామ పార్టీ అధ్యక్షుడు రమేశ్‌తో పాటు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడే పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. చౌరస్తా నుంచి సభా ప్రాంగణానికి వచ్చారు. వేదిక వద్ద శివపార్వతుల చిత్ర పటానికి ప్రత్యేక పూజలు చేశారు.
పార్టీలో భారీగా చేరికలు..
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా మండలంలోని గోడాపూర్, పల్సి, అంతర్ని గ్రామానికి చెందిన సుమారు వంద మంది కాంగ్రెస్, బీజేపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి గులాబీ కండువాలు వేసి పార్టీలో చేర్చుకున్నారు. మండలాధ్యక్షుడు ఎన్నీల అనిల్, వైస్ ఎంపీపీ మొహియొద్దీన్, మార్క్‌ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ రేకుల గంగాచరణ్, బీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూం రాజేశ్వర్, పార్టీ సీనియర్ నాయకుడు, బాసర జడ్పీటీసీ ఎల్వంత్వార్ వసంతారమేశ్, గోనె కళ్యాణ్, సూది రాజన్న, కుభీర్ మాజీ సర్పంచ్ జీ.బాబు, సోషల్ మీడియా మండల అధ్యక్షుడు గడ్డం సంజీవ్, దొంతుల రాములు, పార్డి(కె) సర్పంచ్ ఆకుల గంగాధర్, గాడేకర్ రమేశ్, మెంచు రమేశ్, దాసరి మల్లారెడ్డి, గంగారావు, సర్పంచులు, ఎంపీటీసీలు, తదితరులున్నారు.