పెంచికల్ పేట్, ఏప్రిల్ 22 : కేసీఆర్ పదేళ్ల పాలనలో చేపట్టిన పథకాలు, అభివృద్ధే ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సకును గెలిపిస్తాయని ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ, సిర్పూర్ పార్లమెంట్ ఎన్నికల నియోజకవర్గ ఇన్చార్జి దండె విఠల్ పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో లోడ్పల్లి గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్లో చేరగా, ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో రైతులు కంటతడిపెట్టిన రోజు లేదని, కాంగ్రెస్ వచ్చిన నాలుగు నెలల్లోనే రైతులు తాగు, సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి రైతుబంధు అందించడంలో విఫలమయ్యారని, ఓటుతో ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వంలో లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకుడు బిట్టు శ్రీనివాస్, లోడ్పల్లికి చెందిన అలిశెట్టి రాజన్న, గంగన్న, నగేశ్, వెంకటేశ్ పాల్గొన్నారు.
దహెగాం, ఏప్రిల్ 22 : మండల కేంద్రంతో పాటు మొట్లగూడ,రాంపూర్,దిగడ గ్రామాల్లో ఎమ్మెల్సీ దండె విఠల్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బీఎస్పీతో పాటు వివిధ పార్టీల నుంచి 50 మంది బీఆర్ఎస్లో చేరగా, వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నాయకులు శాకీర్, ఎల్కరి ప్రశాంత్ పాల్గొన్నారు.