ఖానాపూర్ టౌన్, ఏప్రిల్ 7: బీఆర్ఎస్కు ప్రజల్లో ఉన్న ఆదరణను చూసి ఓర్వలేక బీజేపీ నీచరాజకీయాలు చేస్తున్నదని ఎమ్మెల్యే రేఖానాయక్ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టి బొమ్మను పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో శుక్రవారం దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. పేపర్ లీకేజీ సంఘటనకు బాధ్యత వహిస్తూ బీజేపీ నుంచి బండి సంజయ్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు.
సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొనే శక్తి లేక అడ్డదారుల్లో ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. పేపర్ లీకేజీ ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, ఏఎంసీ మాజీ చైర్మన్ పుప్పాల శంకర్, నాయకులు రాజగంగన్న, తూము చరణ్, సురేశ్, కేహెచ్ ఖాన్, మెహ్రజ్, గజేందర్, నగేశ్, శంకర్, శ్రీనివాస్, మనోజ్, రాజేశ్వర్, మహిపాల్ పాల్గొన్నారు.