పెంబి, ఏప్రిల్ 5 : భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి విస్తరింప చేస్తున్నారని, అదేవిధంగా సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని కర్ణంలొద్ది గ్రామంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు.. గిరిజన గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందాయన్నారు. తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చి గిరిజనులు రాజకీయంగా ఎదగడానికి కృషి చేశారన్నారు.
విద్య, వైద్యం, సాగు, తాగు నీరు, విద్యుత్ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించి రైతులు, ప్రజల సమస్యలు పరిష్కరించారన్నారు. గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించకుండా కేంద్ర అటవీ శాఖ అడ్డుకుంటుందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్సే విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ఉండి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాళని సూచించారు. కర్ణంలొద్ది-పెంబి రోడ్డు ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల సర్పంచ్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకోచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పుప్పాల లక్ష్మి-శంకర్, వైస్ ఎంపీపీ బైరెడ్డి గంగారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సల్లా నరేందర్ రెడ్డి, సర్పంచ్లు రాథోడ్ నీలబాయి, జాదవ్ కల్పన, నరేశ్, మహేందర్, సూర్యభాను, ఎంపీటీసీ రామారావు, నాయకులు జాదవ్ సురేశ్, రాథోడ్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.