ముఖ్యమంత్రి కేసీఆర్ అసాధారణ నేత అని, ఆయన ప్రధానమంత్రి అయితే దేశం పురోగమిస్తుందని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్ర్టాల్లో లేవని, దేశవ్యాప్తంగా ఈ తరహా పథకాలు రావాలంటే బీఆర్ఎస్సే అధికారంలోకి రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వర్గానికీ న్యాయం చేస్తుంటే.. ఓర్వలేని శక్తులు మతితప్పి మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర సర్కారు చేస్తున్న అభివృద్ధిని కేంద్రంలోని బీజేపీ మెచ్చుకుంటూనే.. కుట్రలు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
భీంపూర్, మార్చి 29 : సీఎం కేసీఆర్ అసాధారణ నేత అని, దేశ పురోగతి ఆయనతోనే సాధ్యమని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అంతకుముందు ఎమ్మెల్యేను మండలవాసులు ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతన్నలకు సీఎం కేసీఆర్ రుణమాఫీ చేసి తీరుతారన్నారు. అర్హులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు, గృహలక్ష్మి పథకం కింద ఇండ్లు కట్టిస్తారని తెలిపారు.
పల్లె ప్రగతితో పంచాయతీలకు కొత్త కళ వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వర్గానికి న్యాయం చేస్తుంటే.. ఓర్వలేని శక్తులు మతితప్పి మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు తెలంగాణ పథకాలు, అభివృద్ధిని మెచ్చుకుంటూనే.. కుట్రలు చేయడం సమంజసమా అని ప్రశ్నించారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ సర్కారే రావాలని అక్కడి ప్రజలు బలంగా కోరుకుంటున్నారన్నారు. బీఆర్ఎస్ సర్కారు ప్రగతి గురించి ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. కంటి వెలుగు, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్లతో ప్రయోజనమని పేర్కొన్నారు.
Adilabad3
ఆరోగ్య తెలంగాణ, పాడి పంటల తెలంగాణతో ప్రతి కుటుంబం సంతోషంగా ఉందన్నారు. చనాక-కొరట ప్రాజెక్టు నిర్మాణంతో 50 వేల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయని వివరించారు. దళితబస్తీ పథకం అమలులో బోథ్ నియోజకవర్గం ముందున్నదని గుర్తు చేశారు. పుట్టిన బిడ్డ నుంచి వృద్ధుల వరకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న సీఎం కేసీఆర్ అని తెలిపారు. గ్రామాల్లో కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఐక్యతగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, ఎంపీపీ కుడిమెత రత్నప్రభ, వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న, బోథ్ నియోజకవర్గం బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కిరణ్, బీఆర్ఎస్ మండల కన్వీనర్ మేకల నాగయ్యయాదవ్, రైతుబంధు మండల కన్వీనర్ మార్సెట్టి అనిల్, సర్పంచ్‌లు మడావి లింబాజీ, కరీం, బాదర్, పెండెపు కృష్ణయాదవ్, అజయ్, ఎల్పుల ప్రతాప్, నిమ్మ వేణుయాదవ్, హనుమద్దాసు, అనిల్, ఎంపీటీసీలు, నాయకులు జి.నరేందర్ యాదవ్, ఎం.కల్చాప్ యాదవ్, జహూర్ అహ్మద్, కళ్లెం శ్రీనివాస్‌రెడ్డి, ఆకటి నరేందర్‌రెడ్డి, కుడిమెత గంగారాం, ఉత్తం రాథోడ్, నవీన్‌యాదవ్, గొల్లి వైభవ్యాదవ్, బక్కి కపిల్యాదవ్ పాల్గొన్నారు.