లింగాపూర్, నవంబర్ 1: తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం బీఆర్ఎస్తోనే సాధ్యపడుతుందని, ప్రజలు ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోవలక్ష్మి అన్నారు. బుధవారం మండలంలోని చిన్న దంపూర్, జముల్ధార, అమృత్గూడ, గోపాల్పూర్, వంజారిగూడ, కొత్తపల్లి, కంచన్‌పల్లి, ఘుంనూర్తో పాటు పలు గ్రామాల్లో పర్యటిస్తూ, ఎన్నికల ప్రచారం చేపట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ప్రస్తుతం కొత్తగా చేపట్టే సంక్షేమ పథకాల మ్యానిఫెస్టోను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి కోవలక్ష్మికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, సిర్పూర్(యు) మండలంలో ఉన్న లింగాపూర్ను ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో పరిపాలన అందించి ఎంతో అభివృద్ధి చేశామన్నారు. ఒక వైపు సంక్షేమం, మరో వైపు అభివృద్ధితో సీఎం కేసీఆర్ పరిపాలన దేశంలోనే ఆదర్శప్రాయమని, ఇక్కడ అమలవుతున్న సంక్షేమ పథకాలు అందరిని ఆకర్శిస్తున్నాయని కొనియాడారు.
నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం, వ్యవసాయానికి పెట్టుబడి సహాయం అందించి అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పు తీసుకువచ్ఛారన్నారు. ఇతర పార్టీల నాయకులు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. గిరిజనులకు పోడుభూముల పట్టాలతో పాటు రైతుబంధు అందించి ఆదుకున్న బీఆర్ఎస్కే అండగా నిలవాలని, రానున్న రోజుల్లో మరింత సంక్షేమం, అభివృద్ధి చేస్తామని హామీనిచ్చారు. తెల్ల రేషన్ కార్డులందరికీ సన్నబియ్యం, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లను పెంచి ఆదుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ్రావ్, వైస్ ఎంపీపీ ఆడే ఆత్మారాం, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఆత్రం అనిల్ కుమార్, నాయకులు తొడసం ధర్మరావ్, లక్యానాయక్, విశ్వంబర్, వంగయ్యనాయక్, బాపురావ్, కిషన్, శేఖర్ పాటు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్,నవంబర్ 1: గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని ఎమ్మెల్యే ఆత్రం సక్కు పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి అరిగెల నాగేశ్వర్రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన పట్టణ నాయకుల, కార్యకర్త సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. సమయం ఎక్కవగా లేదు మీకు కేటాయించిన బూత్ స్థాయిలో కోవలక్ష్మి ప్రచార కరపత్రాలు,వాల్‌పోస్టర్లను అంటించడంతో పాటు పార్టీ మ్యానిఫెస్టోను బూత్ పరిధిలోని ప్రజలకు ఇస్తూ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు,సంక్షేమ కార్యక్రమలను వివరిస్తూ ప్రచారం చేయాలన్నారు. కార్యకర్తలు సమన్వయంతో కలిసి పని చేసి బీఆర్ఎస్ కారు గుర్తుకు వేటు వేయాలని ఓటర్లను అభ్యర్థించాలని కోరారు. కార్యకర్తలే పార్టీకి కీలకమని బాధ్యతగా పని చేస్తేనే గెలుపు సాధ్యం అవుతుందన్నారు. ఏదో చేప్పిండ్రు చేస్తాములే అనుకుంటే పొరపాటు జరుగుతుందన్నారు.
పట్టణంలో 17 పోలీంగ్ బూత్‌లున్నాయని వాటికి సంబంధించిన సామగ్రిని కమిటీ సభ్యులకు అందజేస్తామని చెప్పారు. గురువారం నుంచి రంగంలోకి దిగి ప్రచారం కొనసాగించాలన్నారు. కోవలక్ష్మికి నాకు ఎలాంటి వర్గ విభేదం లేదని ఎవరికైనా అలాంటి అపోహలుంటే పక్కన పెట్టాలన్నారు. అరిగెల నాగేశ్వర్రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ,అభివృద్ధితో ముందుకెళ్లి ప్రజలకు వివరించాలన్నారు. కోవలక్ష్మి,ఎమ్మెల్యే ఆత్రం సక్కు చేపట్టిన అభివృద్ధిని వివరించాలని సూచించారు. స్థానికంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటున్న కోవలక్ష్మి గెలుపునకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మల్లికార్జున్ యాదవ్,సింగిల్ విండో చైర్మన్ అలీబిన్‌హైమద్,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిలువేరు వెంకటేశ్వర్లు,పార్టీ పట్టణ అధ్యక్షుడు హైమద్, నాయకులు రాజేశ్వర్,జీవన్,అన్సార్, సాజీద్,అబ్ధుల్లా, అమన్,చిలుకురి రవి,శైలేందర్, కార్తీక్, ప్రసాద్‌గౌడ్, రఫీ, నజీర్, ఖాలీద్, ఇర్ఫాన్, సత్తన్న, రమేశ్, గిరి,నజీర్ పాల్గొన్నారు.
తిర్యాణి, నవంబర్ 1: సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే ఆత్రం సక్కు,జెడ్పీ చైర్మన్, ఆసిఫాబాద్ నియోజకవర్గ అభ్యర్థి కోవ లక్ష్మి చేసిన అభివృద్ధ్దే బీఆర్ఎస్ పార్టీకి శ్రీరామ రక్ష అని మండలాధ్యక్షుడు,ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ హన్మాండ్ల జగదీశ్ అన్నారు. మండలంలోని పంగిడిమాధర,చింతలమాధర,గీతమందిర్,కొలాంగూడ,తదితర గ్రామాల్లో ఇం టింటా గడపగడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధితో పాటు పలు సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ అభ్యర్థులను మూడోసారి గెలిపిస్తాయన్నారు.ప్రతి ఒక్కరూ కారు గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా కోవ లక్ష్మిని గెలిపించుకోవాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో ఆత్రం యూత్ పోర్స్ జిల్లా అధ్యక్షుడు ఆత్రం వినోద్, ఎంపీపీ మర్సుకోల శ్రీదేవి, జడ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్,పీఏసీఎస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు మడావి గుణవంతరావు, మండలాధ్యాక్షుడు కుర్సెంగ బాదిరావు, బీఆర్ఎస్ నాయకులు ముత్యం రాజయ్య, శంకరయ్య,బ్రహ్మం, రేగోండ రమేశ్, ఇతర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
రెబ్బెన, నవంబర్ 1: మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం బీఆర్ఎస్ నాయకులు విసృతంగా ప్రచారం నిర్వహించారు. పలు గ్రామాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు కేసీఆర్ మ్యానిఫెస్టోలోని అంశాలను గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లికి ఓటర్లకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోవ లక్ష్మిని గెలిపించాలని ఓటర్లను కోరారు.
రెబ్బెన, నవంబర్ 1: ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోవ లక్ష్మిని భారీ మోజార్టీతో గెలిపించాలని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మండలంలోని గోలేటిటౌన్‌షిప్ కార్మికకాలనీనలో బుధవారం సాయంత్రం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు, మ్యానిఫెస్టోలో పెట్టిన పథకాలపై అవగాహన కల్పిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మిని గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ జీఎం కమిటీ మెంబర్ మారిన వెంకటేశ్వర్లు, నాయకులు దాసరి సాంబగౌడ్, సంపతి తిరుపతి, హనుమండ్ల సత్యనారాయణ, కైత స్వామిలతో పాటు పలువురు ఉన్నారు.