ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, ఫిబ్రవరి 3: ఇంద్రవెల్లిలో కాల్చి చంపినవారే కన్నీరు పెట్టినట్లుందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సకు, బీఆర్ఎస్ రాష్ట్ర సహా య కార్యదర్శి, జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్రావుతో కలిసి విలేకరుల సమావేశాన్ని శనివా రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంద్రవెల్లిలో ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో వేలాది మంది ఆదివాసులను పొట్టన పెట్టుకున్నారని, ఇప్పుడు ఏ హకు ఉందని సభ పెట్టి అమరులకు నివాళులర్పించారని ప్రశ్నించా రు. బీఆర్ఎస్ హయాంలో మంజూరు చేసిన నిధులను, తాము చేసినట్లు గొప్పలు చెప్పుకోవడం కేవలం ఆదివాసుల ఓట్ల కోసమేనని పేర్కొన్నారు. సీఎం హోదాలో వచ్చి కేవలం రూ. కోటి మంజూరు చేసి, సభకు మాత్రం రూ. 5కోట్లు దుబారా చేశారని ఆరోపించారు.
2014లో మొదటిసారి సీఎం హోదాలో వచ్చిన కేసీఆర్ రూ. 25 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. రెండోసారి వచ్చినప్పుడు కుమ్రం భీం పేరిట జిల్లాను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి ఎంతో చేసిన కేసీఆర్‌పై సీఎం నోరుపారేసుకోవడం సరికాదని మండిపడ్డా రు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై చి న్న మాట కూడా మాట్లాడలేదని ఎద్దేవా చేశారు. మాజీ సీఎం కేసీఆర్ లేకుంటే రాష్ట్రం ఏర్పాటయ్యేదా.. ఈ రోజు రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవారేనా అని ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. విమర్శలు మానుకొని అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు.
మాజీ ఎమ్మెల్యే సకు మాట్లాడుతూ ఆదివాసీలకు పోడు భూ మి పట్టాలు ఇచ్చి, రైతు బంధు కల్పించిన ఘ నత మాజీ సీఎం కేసీఆర్‌దేనని గుర్తు చేశారు. దండారీ, గుస్సాడీకి నిధులు మంజూరు చేశారని పేర్కొన్నారు. ఎన్నికల హామీ 6 గ్యారెంటీలను పూర్తిగా నెరవేర్చాలని డిమాండ్ చేశా రు. జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్రావు మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ కారణంగానే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందని, ఇకనైనా సీ ఎం రేవంత్ రెడ్డి తన భాష మార్చుకోవాలని హితవుపలికారు. ఎంపీపీ మల్లికార్జున్, బీఆర్ఎస్ నాయకులు మల్లేశ్, గంధం శ్రీనివాస్, వెంకన్న, బాలేశ్ గౌడ్, కుమార్ ఉన్నారు
జిల్లాకు ఫిబ్రవరి 6న సిద్దిపేట ఎమ్మెల్యే, మా జీ మంత్రి హరీశ్‌రావు రానున్నట్లు ఎమ్మెల్యే కోవ లక్ష్మి తెలిపారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించి, అనంతరం పా ర్టీ సర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.