ఆసిఫాబాద్ టౌన్, జనవరి 30 : ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బాలేశ్వరాలయ సమీపంలో ఉత్తర వాహిని పెద్దవాగు వద్ద నర్మదా, సరస్వతీ పుషర ఘాట్లను స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి, బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ జడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావుతో కలిసి గురువారం ప్రారంభించారు. అర్చకులు ఇందారం మధుకర్ శర్మ , నరేశ్‌శర్మ ఆధ్వర్యంలో గంగమ్మకు మంగళహారతులు ఇచ్చి పూజలు చేశారు. కీ.శే. స్వాతంత్ర సమరయోధులు దండనాయకుల శ్రీనివాసరావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కుంభమేళా సందర్భంగా ఈ పుషర ఘాట్లను ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యే కోవలక్ష్మి మాట్లాడుతూ పుషర ఘాట్లు, ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, నాయకులు విశాల్, నవజ్యోతి సాంసృతిక సంస్థ వ్యవస్థాపకులు దండనాయకుల రామారావు, సురేశ్‌కుమార్, అధ్యక్షులు ధర్మపురి వెంకటేశ్వర్లు, సంస్థ ప్రముఖులు గుర్రాల వేంకటేశ్వర్లు, రాధాకృష్ణచారి, ప్రముఖులు గుండ వెంకన్న, జీవన్, శ్రీనివాస్, కీ.శే. శ్రీనివాసరావు కుటుంబీకులు పాల్గొన్నారు.