రెబ్బెన, మార్చి 28 : ఉద్యోగులకు విరమణ తప్పదని, ఉద్యోగంలో భాగమేనని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. బెల్లంపల్లి ఏరియా గోలేటి ఎంవీటీసీలో విధులు నిర్వహిస్తూ మెడికల్ ఇన్వ్యాలిడేషన్ పొందిన టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు దంపతులకు శుక్రవారం రాత్రి గోలేటిలోని యూనియన్ కార్యాలయంలో సన్మానం చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన కోవ లక్ష్మి, దుర్గం చిన్నయ్య వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ, టీబీజీకేఎస్ యూనియన్ బలోపేతానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ అజ్మీరా బాబురావు, ఏఎంసీ మాజీ చైర్మన్ పర్లపల్లి వనజ, మాజీ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ, మాజీ సర్పంచ్‌లు పోటు సుమలత, తోట లక్ష్మణ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పోటు శ్రీధర్‌రెడ్డి, మహిళా మండలాధ్యక్షురాలు అన్నపూర్ణ అరుణ, బీఆర్ఎస్ సీనీయర్ మహిళా నాయకురాలు మన్యం పద్మ, టీబీజీకేఎస్ నాయకులు మంగిలాల్, మారిన వెంకటేశ్వర్లు, సిరిశెట్టి సత్యనారాయణ, మహేందర్‌రెడ్డి, చంద్రశేఖర్, కార్నాథం వెంకన్న, మాంతు సమ్మయ్య, సంపత్, రాంరెడ్డి, ఓరం కిరణ్, బోంగు వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.