జైనథ్, నవంబర్ 10 : ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్, బీజేపీ నాయకులను తరిమికొట్టాలని ఆదిలాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న అన్నారు. బేల మండలంలోని అవాల్పూర్, సిర్సన్న, బాది, హేటి గ్రామాల్లో శుక్రవారం రోడ్ షో నిర్వహించారు. ఆయా గ్రామాల్లో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి వీర తిలకం దిద్ది కోలాటలు ఆడుతూ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ భావాలు కలిగిన పారషూట్ లీడర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. అలాగే టికెట్లు రాలేదని బీజేపీ పక్షన ఉన్న మరో మహిళ ఎక్కడ పోయిందన్నారు సీఎం కేసీఆర్ అన్ని వర్గాల అభివృద్ధి ధ్యేయంగా ఎన్నికల మ్యానిఫెస్టోను తయారు చేశారన్నారు.
బేల మండలంలోని కోకదూర్, సైద్‌పూర్‌కు చెందిన 50 మంది యువకులు బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీ గెలిపించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాయ సంస్థ చైర్మన్ మనోహర్, ఎంపీపీ గంభీర్, వనితాఠాక్రే, జడ్పీటీసీ అక్షిత, సతీష్రావ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రమోద్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వర్ష సునీల్, నాయకులు మంగేశ్, మస్కే తేజ్రావ్, దేవన్న, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.