ఆదిలాబాద్ రూరల్, నవంబర్ 17 : ప్రజా సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని లాండసాంగి, చించుఘాట్, జండగూడ, న్యూచించుఘాట్, చిన్న చించుఘాట్, మాలెబోరిగాం, టెక్డిగూడ, కేబీ కాలనీ, దర్ముగూడ గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామస్తులతో కలిసి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాల తీరును వివరించారు.
మ్యానిఫెస్టోలో పొందుపరిచిన హామీలను వివరిస్తూ కారు గుర్తుకే ఓటు వేయాలని కోరారు. రోడ్ షోలతో పాటు గ్రామస్తులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకుంటూ ప్రచారంలో ముందుకు సాగారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఎంపీపీ గండ్రత్ రమేశ్, వైస్ ఎంపీపీ జంగు పటేల్, జిట్ట రమేశ్, బొమ్మకంటి రమేశ్, రమణ పాల్గొన్నారు.
ఆదిలాబాద్ రూరల్, నవంబర్ 17 : రాష్ట్రంలో బీఆర్ఎస్తో అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని దస్నాపూర్ మజీద్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లింలకు బీఆర్ఎస్ మ్యానిఫెస్టో గురించి వివరించారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.