రూ.400కే గ్యాస్ సిలిండర్ అందిస్తాం
ఉచిత గ్యాస్ అని చెప్పిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం రూ.1200కు మహిళలకు ఇస్తున్నదని, మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ రాగానే అదే మహిళలకు కేవలం రూ.400 మాత్రమే గ్యాస్ సిలిండర్ను అందజేస్తారని ఆదిలాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న అన్నారు.
- ఆదిలాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న
ఆదిలాబాద్ రూరల్, నవంబర్ 6 : ఉచిత గ్యాస్ అని చెప్పిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం రూ.1200కు మహిళలకు ఇస్తున్నదని, మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ రాగానే అదే మహిళలకు కేవలం రూ.400 మాత్రమే గ్యాస్ సిలిండర్ను అందజేస్తారని ఆదిలాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న అన్నారు. సోమవారం ఆదిలాబాద్ రూరల్ మం డలంలోని పొచ్చర, దిమ్మ గ్రామాల్లో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఓటర్లను కలుస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పింఛన్లు రూ.5 వేలకు పెంపు, ఆరోగ్యబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్తో పాటు ఇవన్నీ పొందవచ్చన్నారు. ప్రతి సంక్షేమ పథకం నిరంతర కార్యక్రమాన్ని దశల వారీగా ప్రతి ఒక్కరికీ అందుతాయని అన్నారు. రైతాంగం గత ప్రభుత్వాలతో తీవ్ర నష్టాలను చవిచూసిందని సీఎం కేసీఆర్ నాయకత్వంలో అదే రైతాంగాన్ని వ్యవసాయాన్ని పండుగల ఆదుకునేలా రైతుబంధు, రైతుబీమా, దళిత బస్తీ ద్వారా మూడెకరాల భూమిని అందించి వ్యవసాయాన్ని ప్రోత్సహించారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గండ్రత్ రమేశ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణ, మాజీ ఎంపీపీ జగదీశ్, పరమేశ్వర్, కొమ్ర రాజు, పురుషోత్తం, గంగాధర్, ఉపసర్పంచ్ రామన్న, కేశవ్రెడ్డి, గంగయ్య, ఆరె నరేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

