ఎదులాపురం, మే16: అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసే, వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరగా, వారికి గులాబీ కండువాలు కప్పి ఎమ్మెల్యే ఆహ్వానించారు. మావల సర్పంచ్ దొగ్గలి ప్రమీల రాజేశ్వర్, ఉప సర్పంచ్ మహేందర్, గంగుల కిరణ్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నేతలు రామెల్లి గోవర్ధన్, మెట్టె ప్రభాకర్, సాగర్, ప్రదీప్, సచిన్ దూడ నారాయణ, తదితరులు గులాబీ గూటికి చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా నిలిచేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే, కేంద్రంలోని బీజేపీ కుల, మతాల మధ్య చిచ్చుపెడుతూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నదని ఆరోపించారు. దేవుడి పేరిట రాజకీయాలు చేస్తున్న బీజేపీ, ఆలయాల అభివృద్ధిని మాత్రం విస్మరించడం వెనుక ఆంతర్యమేమిటో చెప్పాలని ప్రశ్నించారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు.
గ్రామీణ క్రీడలను ప్రోత్సహిస్తాం..
జైనథ్, మే16: గ్రామీణ ప్రాంతంలోని యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకే జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేయూతనిస్తున్నట్లు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. నీరాల గ్రామంలో నెల రోజులుగా నిర్వహిస్తున్న క్రికెట్ పోటీల్లో విజేతలకు మంగళవారం బహుమతులు అందజేశారు. క్రీడల్లో రాణించాలని యువతకు సూచించారు.
ఆదివాసీ సంస్కృతి గొప్పది
ఆదివాసీ పర్థాన్ సమాజ్ సంస్కృతీ సంప్రదా యాలు గొప్పవని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నా రు. నిరాలలో ఆయనకు ఘన స్వాగతం పలికా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదివాసీ పర్ధాన్ సమాజ్ కులగురువు హీరాసుక ఆ లయాలను నిర్మిస్తున్నామన్నారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, నాయకులు ప్రభాకర్, గంగా ప్రసాద్, సుభాష్, సునిల్ తదితరులున్నారు.