జైనథ్, అక్టోబర్ 18: ఎన్నికల హామీలకే పరిమితమైన కాంగ్రెస్, బీజేపీలకు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మండలంలోని సాత్నాలలో బుధవారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గుస్సాడీ నృత్యం, డోలు వాయిద్యాలతో మహిళలు వీర తిలకం దిద్ది స్వా గతం పలికారు. సాత్నాల బస్టాండ్ నుంచి భారీ ఎత్తు న ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే విజయ సంకేతం చూపుతూ ఉత్సహంగా ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడు తూ పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బృహత్తర పథకాలతో దేశానికే ఆదర్శంగా నిలుపుతున్నారన్నారు.
ఆదివాసీ గిరిజనుల ఓటడిగే హక్కు కేవలం బీఆర్ఎస్ పార్టీకే ఉందన్నారు. జోడేఘాట్ అభివృద్ధి, పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనతతోపాటు ఆసిఫాబాద్ జిల్లాకు కుమ్రం భీం జిల్లాగా పేరు పెట్టింది సీఎం కేసీఆరేనని గుర్తు చేశారు. కాంగ్రెస్ను నమ్మొద్దని, కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. మారుగూడ, మాంగూర్ల గ్రామాలకు చెందిన మతిన్, హైమద్, పార్టీ నాయకుడు గణేశ్ నాయుడు ఆధ్వర్యంలో 60 మంది యువకులు బీఆర్ఎస్లో చేరారు. వా రికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి, లైబ్రరీ చైర్మన్ మనోహర్, ఎంపీపీలు గోవర్ధన్, ఆకుల రమేశ్, నాయకులు తుమ్మల వెంకట్ రెడ్డి, రైతుబంధు మండల కన్వీనర్ లింగారెడ్డి, ఎంపీటీసీ ఫోరం మండలాధ్యక్షుడు పెందూర్ దేవన్న ఉన్నారు.