ఆదిలాబాద్ రూరల్, అక్టోబర్ 22 : ప్రజా క్షేత్రంలో ఆటో డ్రైవర్లు కీలకమని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ చేరికల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు నయీం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆటో డ్రైవర్లు పార్టీలో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానం పలికారు. ఎమ్మెల్యే స్వ యంగా ఆటో నడిపి వారిని ఉత్సాహపరిచారు.
ఎమ్మెల్యే మాట్లాడు తూ అన్ని వర్గాల సంక్షేమానికి బీఆర్ఎస్ కృషి చేస్తోందన్నారు. కార్య క్రమంలో భాగంగా పార్టీ అమలు చేసిన పథకాలు, మానిఫెస్టోను వివరించారు. బీఆర్ఎస్కు వస్తున్న ఆదరణ ను చూసి బీజేపీ, కాంగ్రెస్ నేతలు ప్రచారం చేయడానికే జంకుతున్నారని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని, కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్కు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ యాసం నర్సింగ్‌రావ్, పట్టణ కార్యదర్శి అష్రఫ్, ఉపాధ్యక్షులు విజ్జగిరి నారాయణ, దాసరి రమేశ్, సలీం పాల్గొన్నారు.
పట్టణానికి చెందిన పలువురు బీజేపీ నాయకులు బీఆర్ఎస్ గూ టికి చేరారు. పట్టణంలోని కుమార్ పేట్‌కు చెందిన సోమ ప్రశాంత్, సోమ తిరుపతికి ఎమ్మెల్యే జోగు రామన్న బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. వారితోపాటు మరో 200 మంది యువకులు, మహిళలు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ మ్యానిఫెస్టోను వివరించారు. పట్టణ మహిళా అధ్యక్షురాలు స్వరూపారాణి, అందే శ్రీదేవి, ఓరగంటి రఘు, ప్రశాంత్, తిరుపతి, నవీన్ పాల్గొన్నారు.
ఆదిలాబాద్‌లోని మున్నూరుకాపు సంఘం భవనంలో నిర్వహించిన నవరాత్రోత్సవాల్లో ఎమ్మెల్యే జోగు రామన్న పాల్గొన్నారు. శారదా మాతకు మహిళలతో కలిసి ప్రత్యేక పూజలు చేశారుఅనంతరం బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, తదితరులున్నారు.