ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 14 : అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టం చేశారు. మావల మండల కేంద్రంలోని మసీదు ఆవరణలో రూ.20 లక్షల వ్య యంతో నిర్మించిన దుకాణ సముదాయాలను సోమవారం ఆయన ప్రారంబించారు. ముందుగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు స్థానికులు ఘ న స్వాగతం పలికారు. అనంతరం దుకాణాలను రి బ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అంతకుముందు అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా వైకుంఠధామంలో రూ.5 లక్షలతో ఏర్పాటు చేయనున్న హైమాస్ లైటింగ్ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుల, మతాలకు అతీతంగా సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభు త్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. రూరల్ ఎంపీపీ గండ్రత్ రమేశ్, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, నాయకులు నల్ల రాజేశ్వర్, ఏవన్, రాజన్న పాల్గొన్నారు.
రాష్ట్రంలో అమలు చేస్తున్న బృహత్ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే జోగురామన్న పునరుద్ఘాటించారు. పట్టణంలోని ఘడియార్ మహల్ కాలనీలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ చేరికల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ముందుగా కాలనీకి వచ్చిన ఎమ్మెల్యేకు డప్పు చప్పుళ్లు, డీజే గీతాల నడుమ ఘన స్వాగతం పలికారు. మసేద్ ఇస్లాం కమిటీ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో యువకులు, మహిళలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పుతూ ఎమ్మెల్యే సాదరంగా స్వాగతం పలికా రు. ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టాలని పి లుపునిచ్చారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్ చైర్మన్ జహీర్ రంజాని, బీఆర్ఎస్ పట్టణాధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అలాల్ అజయ్, అశ్రఫ్, కౌన్సిలర్ సలీం, రామేశ్వర్, నాయకులు సాజిదుద్దీన్, ఇమ్రాన్, జోహుర్ పాల్గొన్నారు.