బీఆర్ఎస్ సంస్థాగత బలోపేతంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా నేతలు మహారాష్ట్రలో శుక్రవారం పర్యటించారు. రాజురా నియోజకవర్గంలో ఎమ్మెల్యే జోగు రామన్న, కిన్వట్ తాలుకాలో మాజీ ఎంపీ నగేశ్ స్థానిక నాయకులతో సమావేశమ య్యారు. ఆయా గ్రామాల్లో స్థానికులు స్వచ్ఛందంగా తరలివచ్చి, బీఆర్ఎస్ నేతలను కలిసేందుకు ఆసక్తి చూపారు. కాగా, తెలంగాణలో అమలవుతున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను వారికి నేతలు వివరించారు. ఈ సందర్భంగా అన్ని వర్గాల ప్రజల నుంచి ఆదరణ లభిస్తున్నదని ఎమ్మెల్యే, మాజీ ఎంపీ తెలిపారు.
-ఆదిలాబాద్(నమస్తే తెలంగాణ)/ బోథ్, డిసెంబర్ 23
ఆదిలాబాద్, డిసెంబరు 23 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ సంస్థాగత బలోపేతంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా నేతలు మహారాష్ట్రలో శుక్రవారం పర్యటించారు. రాజురా నియోజక వర్గంలో ఎమ్మెల్యే జోగు రామన్న, కిన్వట్ తాలుకాలో మాజీ ఎంపీ నగేశ్ స్థానిక నాయ కులతో సమావేశమయ్యారు. రాజురా స్వతంత్ర భారత పక్ష పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వామన్రావ్ శతప్ ఘన స్వాగతం పలికారు. పలు స్థానిక నాయకులు, ప్రజలతో ఎమ్మెల్యే రామన్న సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం రైతులు, పేదలు, మహిళలు, కులవృత్తులు, ఇతర వర్గాల కోసం చేపడుతున్న సంక్షేమ పథకాలను స్థానికులకు వివరించారు. మాజీ ఎంపీ జీ నగేశ్ కిన్వట్ తాలుకాలోని బుధవార్‌పేట్, దేగామ, మర్కగూడ, పిప్పల్కోరి, సార్ఖనిలో పర్యటిం చారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, తాంసి జడ్పీటీసీ తాటిపల్లి రాజు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రౌతు మనోహర్ ఉన్నారు.
బీఆర్ఎస్తోనే దేశంలో మార్పు మాజీ ఎంపీ నగేశ్
బోథ్, డిసెంబర్ 23 : కేసీఆర్ నాయకత్వం లోని భారత రాష్ట్ర సమితితోనే దేశంలో రాజకీయ మార్పు మొదలవుతుందని ఆదిలాబాద్ మాజీ ఎంపీ గొడాం నగేశ్ పేర్కొన్నారు. మహారాష్ట్ర కిన్వట్ తాలూకా బుధవార్‌పేట్, సార్ఖని తదితర ప్రాంతాల్లో శుక్రవారం ఆయన జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు తాటిపెల్లి రాజు, బీఆర్ ఎస్ శ్రేణులతో కలిసి పర్యటించారు. వీరికి అక్కడి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. సమావే శానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సంద ర్భంగా మాజీ ఎంపీ మరాఠీ, గోండి భాషలో మాట్లాడి అక్కడి వారిని ఆకట్టుకున్నారు.
ఆయా గ్రామాల్లో తిరిగి అభివృద్ధిని అడిగి తెలుసుకు న్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశం లో నగేశ్ మాట్లాడారు. తెలంగాణలో రైతులకు ఉచిత కరెంట్, రైతు బంధు, రైతు బీమా సాయం, వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు, బీడీ కార్మికు లకు పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఒంటరి మహిళలకు పింఛన్లు సర్కారు అందిస్తు న్నదని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ఉద్యోగాల నోటిఫికేషన్లు వంటి వాటిపై మరాఠీలో తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణలో అమలవుతున్న పథకాలన్నీ దేశ ప్రజలందరికీ అందే అవకాశం ఉందన్నారు.
మహారాష్ట్రలో ప్రతి గ్రామంలో బీఆర్ఎస్లో చేరేం దుకు ఆసక్తి చూపడం హర్షణీయమన్నారు. ఆయా గ్రామస్తులు మాజీ ఎంపీకి ఘన స్వాగతం పలికారు. న్యాయవాది రాథోడ్ సుభాష్, సిడాం నారాయణరావు, రిటైర్డ్ తహసీల్దార్ సీతారాం, తొడసం లక్ష్మణ్, జుగ్నక్ గణపతి, పెందూర్ సంజీవ్, తాంసి, భీంపూర్ జడ్పీటీసీలు రాజు, సుధాకర్, బోథ్ సొసైటీ చైర్మన్ ప్రశాంత్, సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు బీ శ్రీధర్‌రెడ్డి, జుగధిరావు, రాజేశ్వర్, విజయ్, గులాబ్‌సింగ్, మడావి లింబా జీ, సంతోష్, వైద్యనాథ్, తిరుపతి పాల్గొన్నారు.