స్వరాష్ట్రంలో ఆలయాల నిర్మాణానికి పెద్దపీట
స్వరాష్ట్రంలో నూతన ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం సిర్పెల్లి(హెచ్) గ్రామం లో నిర్మించిన ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
- ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి
కుభీర్, మే 25 : స్వరాష్ట్రంలో నూతన ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం సిర్పెల్లి(హెచ్) గ్రామం లో నిర్మించిన ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఆయనను ఆలయ ఆవరణలో శాలువా, పూల మాలతో సత్కరించారు. బీఆర్ఎస్ నాయకులు గంట ఆనంద్, వీడీసీ, ఆలయ కమిటీ సభ్యులు, మాజీ సర్పంచ్‌లు దత్తురాం పటేల్, కొట్టె హన్మాండ్లు, మండల నాయకులు పాల్గొన్నారు.
హజ్‌యాత్రికులకు వైద్య పరీక్షలు
భైంసా, మే, 25 : హజ్‌యాత్రకు వెళ్లే యాత్రి కులకు గురువారం భైంసాలోనిఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హజ్ యాత్రకు వెళ్తున్న వారికి హైదరాబాద్‌లో జూన్ 7వ తేదీ నుంచి విమానాలు అందుబాటులో ఉంటాయ న్నారు. యాత్రకు వెళ్తున్న పలువురిని పూలమాల శాలువాతో సత్కరించి మెడికల్ కిట్లను అందించా రు. డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌వో ఇద్రిజ్, ఏరియా దవాఖాన సూపరింటెం డెంట్ కాశీనాథ్, బీఆర్ఎస్ నాయకులు వాసే, జావిద్, అబ్దుల్ అమీద్, మహ్మద్ ఉమద్ చౌదరి, మౌలానా ముస్లిం మత పెద్దలు, తదితరులు ఉన్నారు. కాగా భైంసాలోని విశ్రాంతి భవనంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. జఫర్ షహీన్‌కు రూ. 55 వేలు, షేక్ నజీర్ అహ్మద్‌కు రూ. 25 వేలు చెక్కులను అంద జేశారు. బీఆర్ఎస్ నాయకులు అహాద్, వాసే, ఆరిఫ్, జావీద్, ఎండీ ఉమర్ చౌదరి ఉన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత
భైంసాటౌన్, మే, 25 : తానూర్ మండలం జౌల (కే) గ్రామానికి చెందిన నాగరబాయికి రూ. 90 వేలు, జే విఠల్‌కు రూ. 14 వేలు సీఎం సహా యనిధి నుంచి మంజూరయ్యాయి. చెక్కులను ఎమ్మెల్యే విఠల్ రెడ్డి లబ్దిదారులకు దేగాంలోని తన నివాసంలో అందజేశారు.
ఎమ్మెల్యేను సన్మానించిన వీఆర్ఏలు
భైంసాటౌన్, మే, 25 : ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని భైంసా మండల వీఆర్ఏలు శాలువాతో సన్మా నించి మిఠాయి తినిపించారు. ఈ సందర్భంగా పలువురు వీఆర్ఏలు మాట్లాడుతూ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి రుణపడి ఉంటామన్నారు. గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దాదేమియ్యా, ముత్త న్న, హైమద్, సాయన్న, గంగన్న, చాంద్, రమేశ్, రమణ, సాయినాథ్, భూమన్న పాల్గొన్నారు.
ఆరోగ్యంపై దృష్టి సారించాలి
నిర్మల్ అర్బన్, మే 25 : హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలు ఆరోగ్యంపై దృష్టి సారించాలని నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ పేర్కొన్నారు. ఐఏ ఫంక్షన హాల్లో హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు వైద్య పరీక్షలు చేసి టీకాలు వేశారు. రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు నజీరుద్దీన్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ, వైద్యులు నయనా రెడ్డి, రాజేంద్ర ప్రసాద్, వేణుగోపాల కృష్ణ, మతిన్, వైద్య సిబ్బంది తదితరులున్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

