కుభీర్, మే 7: రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సమన్యాయం కల్పిస్తూ వారి మనోభావాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నామని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి అన్నారు. కుభీర్‌కు చెందిన పలువురు ముస్లిం లు, బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు ఆదివారం దేగాంలోని ఆయన నివాసంలో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువా, పూలమాలలతో సత్కరించారు. అనంతరం జాంగాం రోడ్డులోని ఈద్గా విస్తరణ, మరమ్మతులు, అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయాలని విన్నవించారు.
స్పందించిన ఎమ్మెల్యే.. త్వరలో నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల పండుగలకు సీఎం కేసీఆర్ కానుకలు ఇస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా పార్టీ మండలాధ్యక్షుడు ఎన్నీల అనిల్, వైస్ ఎంపీపీ మోహియొద్దీన్, పీఏసీఎస్ చైర్మన్ రేకుల గంగాచరణ్, బీఆర్ఎస్ నాయకులు కచ్చకాయల శంకర్, పీ విజయ్‌కుమార్, మైనార్టీ నాయకులు ముజాహిద్ఖాన్, ఎక్బాల్ తదితరులు పాల్గొన్నారు.