ఖానాపూర్, నవంబర్ 28:తనను ఆశీర్వదించి గెలిపిస్తే, నియోజకవర్గాన్ని అభివృద్ధిపథంలో ని లుపుతానని ఖానాపూర్ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్‌నాయక్ అన్నారు. పట్టణంలోని 3, 5, 9 వార్డుల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా వార్డుల్లో మహిళలు, ప్రజలు డీజే చప్పుళ్లతో, డప్పు వాయిద్యాలతో, మంగళహరతులు, పటాకులు కాలుస్తూ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప ట్టణంలో అభివృద్ధి కొనసాగడానికి కారు గుర్తుకే ఓటేయాలని కోరారు.
ఇతర పార్టీల నాయకులు చెప్పే మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడే బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపాలని కోరారు. సీఎం కేసీఆ ర్ హ్యాట్రిక్ విజయం సాధించడానికి ప్రతి ఒక్క రూ కుడా కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, కౌ న్సిలర్లు, నాయకులు, వార్డు ప్రజలు, పట్టణ, మం డల బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
కడెం, నవంబర్ 28: నియోజకవర్గ అభివృద్ధి బా ధ్యత తనదేనని, ప్రజలు ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి భూక్యా జాన్సన్‌నాయక్ అన్నారు. మండలంలోని పెద్దబెల్లాల్, మొర్రిగూడెం, హరిజనవాడ, లింగాపూర్ గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రజలు, నాయకులు స్వాగతం పలకగా, మహిళలు మంగళహారులతో దీవించారు. అనంతరం అయా గ్రామాల స మస్యలను అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.
నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత నాదేనని, మంత్రి కేటీఆర్ చొరవతో ఖానాపూర్‌ను మరో సిరిసిల్లగా తయారు చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రి కేటీఆర్ ఖానాపూర్‌ను దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారని, ఖానాపూర్ నియోజకవర్గానికి ఎంతో భవిష్యత్తు ఉందని పేర్కొన్నారు. ఈవీఎం బ్యాలెట్లో తనది మొదటి గుర్తు అని, ప్రజలు మొదటి గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని కోరారు. సర్పంచులు రమాదేవి, ఆ కుల బాలవ్వ, జడ్పీటీసీ పురపాటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీలు సరళాదేవి, సుద్దాల లక్ష్మి, నాయకు లు ఆకుల లచ్చన్న, సురేందర్, సన్నీ, బాలు, వెం కటేశ్, తదితరులున్నారు.
కడెం, నవంబర్ 28: మండలంలోని పలు గ్రా మాల్లో ఇంటింటా తిరుగుతూ బీఆర్ఎస్కు ఓటు వేసి జాన్సన్‌నాయక్‌ను ఖానాపూర్ ఎమ్మెల్యేగా గె లిపించాలని, నాయకులు కోరారు. రేపు జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి, ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను గెపించుకుందామని పిలుపునిచ్చారు. నాయకులు స్టీఫెన్, సుగుణాకర్, ప్రవీణ్, ఆనంద్‌గౌడ్, యేసయ్య, సత్యనారాయణరావు, సుజిత్‌రావు, జగన్రావు, సుంకే రాజన్న, వినయ్, రా జేందర్, ఆంజనేయులు, సాయి, సత్తన్న, గంగారాజం, ప్రశాంత్, తదితరులున్నారు.
ఖానాపూర్ టౌన్, నవంబర్28: పట్టణంలోని పదో వార్డులో నాయకులతో కలిసి కౌన్సిలర్ కుర్మ శ్రీను ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓ టేసి, జాన్సన్ నాయక్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నాయకులు ఉన్నారు.
ఖానాపూర్ రూరల్, నవంబర్ 28: మండలంలోని మస్కాపూర్, తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులు విసృత ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్‌కు మ హిళలు మంగళ హారతి పట్టి గ్రామాలకు ఆహ్వానించారు. గ్రామాల్లో రోడ్ షో నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు. కారు గుర్తుకు ఓటువేయాలని కోరారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పెంబి, నవంబర్ 28: పెంబి మండలంలోని ఇటిక్యాల తండా, గుమ్మెన గ్రామాలకు చెందిన కాం గ్రెస్, బీజేపీ నాయకులు మంగళవారం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పైడిపల్లి రవీందర్ రావు ఆ ధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. పీఎసీఎస్ డైరెక్టర్ సుతారి రమేశ్, బీఆర్ఎస్ నా యకులు తుర్క మోహన్ రెడ్డి, కొడగంటి నర్స య్య, బోరె రమేశ్, తుర్క దేవేందర్, గోరి పెద్ద య్య తదితరులు పాల్గొన్నారు.
మండల కేంద్రంతో పాటు మందపల్లి గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ బైక్‌ర్యాలీ నిర్వహించా రు. కారు గుర్తుకు ఓటేసి భూక్యా జాన్సన్ నాయక్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సల్లా నరేందర్ రెడ్డి, సుతారి రమేశ్, కొడగంటి నర్సయ్య, దేవెందర్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో మంగళవారం ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సల్లా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటేసి, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్‌ను గెలిపించాలని కోరారు. ఇస్మాయిల్, రియాజ్, నరేందర్, మహేందర్, రాజేందర్, గోధూరి సరోజ తదితరులు పాల్గొన్నారు.
దస్తురాబాద్, నవంబర్ 28: మండలంలోని ఆ యా గ్రామాల్లో మంగళవారం బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. గొడిసెర్యాల సర్పంచ్ సిడాం లక్ష్మి, నాయకులు, ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.