ఆదిలాబాద్ : గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రోడ్ల అభివృద్ధి జరిగిందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. నేరడిగొండ మండలంలోని కుమారి గ్రామం నుంచి గాజిలి వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందన్నారు. తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిపిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కష్టాలనే మిగిలాయని విమర్శించారు. అలవికాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీఆర్ఎస్ తరఫున పోరాడు తామన్నారు. అనంతరం గ్రామస్తులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, అధికారులు పాల్గొన్నారు.