తలమడుగు, ఏప్రిల్ 2 ః పదేళ్లలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ర్టాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేశారని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. బుధవారం భరంపూర్ గ్రామంలో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌తోనే రాష్ట్ర అభివృద్ధి జరిగిందన్నారు. గ్రామంలో పలు సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి పత్రాలు అందజేశారు.
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్వో వాజిద్, తహసీల్దార్ రాజ్‌మోహన్, ఎంపీడీవో శేఖర్, పీఏసీఎస్ చైర్మన్ వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ తోట వెంకటేశ్, నాయకులు ముడుపు కేదారేశ్వర్ రెడ్డి, రంజిత్‌రెడ్డి, రమాకాంత్, సుదర్శన్, మడూరి మల్లేశ్, కాట్పెల్లి శ్రీనివాస్‌రెడ్డి, పల్లవి, సునీత, రాంబాయి పాల్గొన్నారు.